పవన్ పార్టీ గుర్తు షట్చక్రం, నినాదం ఫైట్ ఫర్ ది రైట్స్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. పవన్ కొత్త పార్టీ గుర్తు ఏమిటి, ఆయన ఏం మాట్లాడుతారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయమై వరుసగా స్పష్టత వస్తోంది. తాజాగా పవన్ పార్టీ గుర్తు, నినాదం వెలుగులోకి వచ్చింది. పవన్ పార్టీ గుర్తు షట్చక్రం కాగా, నినాదం ఫైట్ ఫర్ ది రైట్స్ అని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు తన పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ విధివిధానాలు, పార్టీ గుర్తును ఆయన చెబుతారు. కాగా, పవన్ కల్యాణ్ స్పీచ్ లైవ్ ఈవెంట్ అంటూ వస్తున్న ప్రోమోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Pawan Kalyan party symbol is Satchakram

'నీకోసం జీవిస్తే నీలోనే కలిసిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు', 'ప్రజలను పాలించే వాడు కాదు ప్రజల పక్షాన నిలిచేవాడు కావాలి', 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం అంతే తప్పు', 'ఒక మనసులో కోపం ఉంటే అది శక్తి అదే గుంపులో ఉంటే ఉద్యమం'... ఇలాంటి ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి.

కాగా, పవన్ కల్యాణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే రాష్ట్రంలోని నలుమూలల నుండి భారీ ఎత్తున అభిమానులు రాజధాని నగరమైన హైదరాబాదుకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు, పలు థియేటర్లలో పవన్ స్పీచ్ ప్రసారం కానుంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/myawP8bzqbI?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+