పవన్ కళ్యాణ్ పార్టీతో అల్లు అర్జున్‌కు చిక్కులు

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు కేంద్ర మంత్రి చిరంజీవి అల్లుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్‌కు చిక్కులు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రకటన చేయనున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిని రేసు గుర్రం సినిమాకు కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం కారణంగా ఈ నెల 14వ తేదీన జరగాల్సిన రేసు గుర్రం ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ సినిమా విడుదలలో కూడా జాప్యం జరుగుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడు కావడంతో ఆయన రాజకీయ వ్యవహారాల ప్రభావం రేసు గుర్రం ఆడియో విడుదల కార్యక్రమంపై పడే అవకాశాలున్నాయని భావించి వాయిదా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Pawan Kalyan party troubles Allu Arjun

నిజానికి రేసు గుర్రం సినిమాను ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నట్లు చెబుతున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం - ఈ సినిమా విడుదల ఏప్రిల్ మొదటివారానికి వాయిదా పడిందని అంటున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన రేసు గుర్రం సినిమాలోశ్రుతిహాసన్‌, సలోనీ హీరోయిన్లుగా నటించారు.

రేసు గుర్రం సినిమా విడుదలకు మరో ఆటంకం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను విడుదల చేయడానికి థియేటర్లు కూడా ఖాళీ లేవని తెలుస్తోంది. బాలకృష్ణ లెజెండ్ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతున్నందున కూడా రేసు గుర్రం సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+