సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ పాదయాత్ర, జగన్‌కు షాక్ తగిలేనా?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదాయాత్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదాయాత్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాదయాత్రపై జనసేనలో చర్చ
పాదయాత్ర విషయమై పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర చేయాలా లేక బస్సు యాత్రనా అనే అంశంపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి పాదయాత్ర అనే ప్రచారం సాగుతోంది. కానీ అన్నింటిని పరిశీలించి ఓ నిర్ణయానికి రానున్నారు.

జగన్ పాదయాత్ర ఆరు నెలలకు పైనే
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం (26-11-2017) నాటికి ఆయన పాదయాత్ర పద్దెనిమిదో రోజుకు చేరుకుంది. జగన్ పాదయాత్ర ఆరు నెలలు అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగనుంది.

జగన్ పాదయాత్ర కార్నర్
ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర లేదా బస్సుయాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమైతే అది జగన్ యాత్రకు కౌంటర్ అవుతుందని, అలాగే ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత యాత్రను కార్నర్ చేయనుందని భావిస్తున్నారు.

జగన్ కంటే పవన్ కళ్యాణ్‌కు
జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. పవన్ పాదయాత్ర చేసినా లేక బస్సుయాత్ర చేసినా అంతకంటే ఎక్కువ స్పందన ఉంటుందని అంటున్నారు. మీడియా కూడా పవన్ యాత్రకు హైప్ ఇస్తుందని, అప్పుడు జగన్ యాత్ర కార్నర్ కావడం ఖాయమని అంటున్నారు.












Click it and Unblock the Notifications