'పవన్ కళ్యాణ్ సినిమాకు మోడీ స్క్రిప్ట్, అజ్ఞాతవాసిలా ప్లాప్ కావడం ఖాయం'

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బుధవారం నాడు నిప్పులు చెరిగారు. పవన్ రాజకీయ సినిమాకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్క్రిప్ట ఇచ్చారని ఆరోపించారు. పవన్ రాజకీయ సినిమా అజ్ఞాతవాసిలా ప్లాప్ అవడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైసీపీ అధినేత వైయస్ జగన్, బీజేపీ, పవన్ కళ్యాణ్‌లు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan political cinema under PM Narendra Modi, TDP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను బీజేపీ కాలరాస్తోందని మరో టీడీపీ నేత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో వైసీపీ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

ఈ రోజు బీజేపీ, వైసీపీలు వేర్వేరు పార్టీలు కాదని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఏపీలో జగన్‌ను చూసుకోని బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదేపదే ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+