వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్: జూ.ఎన్టీఆర్‌కు దెబ్బ?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆకాంక్షలకు పెద్ద విఘాతం ఏర్పడినట్లే. జనసేనను స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏ మాత్రం ఉండదు.

చంద్రబాబుకు దూరం కావడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను దువ్వడానికే కాదు, చెంత చేర్చుకోవడానికి కూడా చంద్రబాబు గానీ, ఆయన బాబాయ్ బాలకృష్ణ గానీ ఏ మాత్రం ఇష్టంగా లేరు. చంద్రబాబు, నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేసే అవకాశాలున్నాయనే వార్తలకు బలం చేకూరుతోంది.

Pawan Kalyan power hits Junior NTR

వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాలని ఓ స్థితిలో చంద్రబాబు ఆలోచించినట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సత్సంబంధాల కోసం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రయత్నాలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, సయోధ్య కుదరలేదని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బిజెపిలతో అవగాహనకు వచ్చి ప్రచారం సాగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చరిష్మాతో పాటు బాలకృష్ణ ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని భావిస్తున్నారు. అటువంటి స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండదు.

కొడాలి నాని ఉదంతం..

జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడాన్ని బాలకృష్ణ ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారని అంటున్నారు. నాని వ్యవహారాన్ని ఖండించాలని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కు పత్రికా ముఖంగా సూచించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ పనిచేయలేదు. అప్పటి నుంచి చంద్రబాబుకు, బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారు.

English summary
If Pawan Kalyan joins hands with the TD, Jr NTR, who worked with the TD in the last elections, is likely to be the loser. Earlier the party wanted to use Jr NTR for its campaign in the coming elections. But now, if Pawan Kalyan is willing to campaign for the party, with Balakrishna already there, they may not need Jr NTR at all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X