అడ్డంగా నిలబడతాం.. పవన్ కల్యాణ్ సంచలన పోస్టు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి తన దేశ భక్తిని చాటారు. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల దృష్ట్యా జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలిపిన జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ఒక్కరూ సమిష్టిగా, బలంగా నిలబడదాం.. భారత దేశపు ఐక్యతను చాటి చెప్పుదామని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి సమయంలో "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించి, భారత్ కు రక్షణ కవచంలా నిలచిన భద్రతా దళాలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత దేశానికి, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడు లోని దేవ సేనాని శ్రీ సుబ్రమణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన @JanaSenaParty నాయకులకు, జనసైనికులు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం
— Pawan Kalyan (@PawanKalyan) May 16, 2025
జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి సమయంలో "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్… pic.twitter.com/Cr5H0bcMuD
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ PAC చైర్మన్, మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, MLC శ్రీ పిడుగు హరిప్రసాద్, మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎంఎల్ఏ లు శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంతం నానాజీ, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్, శ్రీ అరవ శ్రీధర్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ నిమ్మక జయకృష్ణ గార్లకు, AHUDA చైర్మన్ శ్రీ T.C వరుణ్, KUDA చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గార్లకు, అలాగే మతాలకు అతీతంగా ఈ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్క నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ఒక్కరూ సమిష్టిగా, బలంగా నిలబడదాం, భారత దేశపు ఐక్యతను చాటి చెపుదాం.. అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications