ఒక్క ప్రకటన.. 20 లక్షల ఓట్లు?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఏపీలోని ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన వ్యూహాల్లో తలమునకలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడంతోపాటు పదుల సంఖ్యలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉండాలని ఆయన తలపోస్తున్నారు. అందుకనుగుణంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీతో చర్చిస్తున్నారు.

ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఒక హామీ ఇచ్చారు. సీపీఎస్ (కంట్రిబ్యూటరి పింఛన్ పథకం)ను రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సాధ్యాసాధ్యాలన్నీ ఆర్థిక కష్టాలతో ముడిపడి ఉండటంతో ఆయన కూడా వెనకాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉన్న సమయంలో దీనిపై టక్కర్ కమిటీని వేశారు. అంతటితో దాని కథ ముగిసిపోయింది. కానీ పవన్ కల్యాణ్ ఇటీవలే సీపీఎస్ కు సంబంధించి ఒక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సీపీఎస్ ను తాను రద్దుచేస్తామని, అధికారంలోకి రాగానే జనసేన తరఫున సంతకం చేసే రెండోఫైలు అదే అవుతుందన్నారు.

జగన్, చంద్రబాబువల్లే కాలేదు..
వాస్తవానికి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ సంచలనం అనే చెప్పుకోవచ్చు. జగన్, చంద్రబాబు కూడా తాము రద్దుచేస్తామనే హామీని ఇవ్వలేకపోయారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ కూడా ఇదే. గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చాలంటూ ఇప్పటికే వైసీపీపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఉద్యమాలు కూడా నిర్వహించారు.

ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో విఫలం
సీపీఎస్ ను రద్దుచేస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కల్యాణ్ కు ఆశించిన రీతిలో స్పందన వ్యక్తం కావడంలేదు. జనసేన నాయకులైతే అసలు తమ అధినేత ఈ హామీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల్లో కూడా ఎవరూ జనసేనానికి కు అభినందనలు తెలపడంకానీ, తామంతా అండగా ఉంటామని కానీ ప్రకటించలేదు. ఒకవేళ ఈ హామీని ప్రజల్లోకి తీసుకువెళితే నాలుగున్నర లక్షల ఉద్యోగులతోపాటు పదవీ విరమణ చేసిన మూడు లక్షల ఉద్యోగుల కుటుంబాలకు చెందిన ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ పవన్ కల్యాణ్ హామీని ఆ పార్టీ నాయకులే ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో విఫలమవుతున్నారు. 20 లక్షలకు పైగా ఓట్లను ప్రభావితం చేసే అంశం కాబట్టి


Click it and Unblock the Notifications