పవన్‌కళ్యాణ్ ప్రశ్న:రాహుల్ స్పందన, పెళ్లిపై రుసరుస! ఇమేజ్ తగ్గని చిరు

అమరావతి: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ప్రశ్నించిన అంశం మరోసారి చర్చకు వస్తోంది. ప్రత్యేక హోదా కోసం పవన్ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఎంపీలను, కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీశారు.

హోదా పైన పవన్ కళ్యాణ్ ప్రశ్నించాక నేతలలో కదలిక వస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకు రెండు రోజులుగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా టిడిపి ఎంపీలు ఆందోళన, శుక్రవారం నాడు రాహుల్ హోదా గురించి ఎక్కడైనా పోరాడుతానని గట్టిగా చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రత్యేక హోదా కోసం డిమాండ్లు వినిపించాయని, ఇప్పుడు ఏకంగా ముఖ్య నేతలు మాట్లాడే పరిస్థితి వచ్చిందని, అందుకు జనసేన అధినేత కూడా ఓ కారణమని అంటున్నారు.

గురువారం నాడు టిడిపి ఎంపీ జేసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ లాంటి వారికి సమాధానం చెప్పేందుకే తాము పార్లమెంటు ఎదుట ఇలా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ఇది చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ తన అనంతపురం జిల్లా పర్యటనలో ప్రత్యేక హోదా గురించి పదేపదే ప్రస్తావించారు.

Pawan Kalyan question: Rahul Gandhi response

ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని, ఇప్పుడైనా వారు మాట్లాడాలని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఎక్కడికైనా వస్తానని, పార్లమెంటులో నిలదీస్తానని చెప్పారు.

పవన్ కళ్యాణ్ నిలదీసిన అంశాన్ని రాష్ట్ర నేతలు చెవిలో వేసినందువల్లే రాహుల్ దానిని చెప్పి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు హోదా గురించి నిలదీస్తేనే కదలిక వస్తుందని నటుడు శివాజీతో పాటు పలువురు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

పెళ్లి పేరు ఎత్తగానే రాహుల్ గాంధీ రుసరుస!

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన ఎత్తగానే మీడియా పైన రుసరుసలాడినట్లుగా తెలుస్తోంది. ఆయన అనంతపురం జిల్లాలో శుక్రవారం పర్యటించిన విషయం తెలిసిందే. పుట్టపర్తిలో సత్యసాయి సమాధిని దర్సించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వ్యాపం కుంభకోణం, లలిత్ గేటు తదితర అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను పెళ్లి గురించి ప్రశ్నించిందని తెలుస్తోంది. దీంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

చిరంజీవి కోసం జనం, అభిమానులు ఎగబడ్డారు

రాహుల్ గాంధీ పర్యటనలో చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయనతో చేయి కలిపేందుకు అభిమానులు, ప్రజలు ఉత్సుకత కనబర్చారు. రాహుల్ గాంధీ టూర్లో మెగా షో కనిపించిందని చెబుతున్నారు. తద్వారా జనంలో చిరంజీవికి ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+