Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతి సంబరాలు: పవన్ కళ్యాణ్‌కు వేలాది మంది ఘన స్వాగతం

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు తెనాలి ఘనంగా స్వాగతం పలికింది.

సంక్రాంతి సంబరాల పేరుతో తోరణాలు

సంక్రాంతి సంబరాలు అంటూ పొలిమేరల్లో పెద్ద ఎత్తున తోరణాలను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఊళ్లో వరకు జనసేన జెండాలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాలు ప్రజలతో జరుపుకునేందుకు విచ్చేయుచున్న జనసేనానికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఇదే తెనాలి నుంచి జనసేనాని 'జాగో రే జాగో' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనసేన రాక కోసం తెనాలి నియోజకవర్గంలోని పెద్దరావూరు అంగరంగ వైభవంగా ముస్తాబయింది.

రోడ్డు షో ద్వారా తెనాలి చేరుకున్నారు

నాదెండ్ల మనోహర్‌తో కలిసి జనసేనాని ఆదివారం తెనాలికి వచ్చారు. ఆయనకు వందలు, వేలాది మంది జనసైనికులు స్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులు, జనసైనికులు స్వాగతం పలకగా.. వారు రోడ్డు షో ద్వారా తెనాలి చేరుకున్నారు.

వేదిక ముస్తాబు

తెనాలిలో రోడ్లు రంగవల్లికలతో అందంగా కనిపిస్తున్నాయి. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా ముగ్గులు వేశారు. పెద్దరావురూ సంక్రాంతి వేడుకల వద్ద బహిరంగ సభ కోసం వేదిక కూడా ముస్తాబయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+