పవన్ వైపే 'మెగా' ఫ్యాన్స్: సభకు చిరు వర్గం హెచ్చరిక
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. సాయంత్రం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. దీని కోసం ఆయన విశాఖకు చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌కు, జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
అభిమానులతో చెర్రీ భేటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేపథ్యంలో మెగా కుటుంబంలో రాజకీయ చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. మెగా అభిమానుల్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. పవన్ సభ రోజునే రామ్ చరణ్ తేజ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో భేటీ కానున్నారు.

ఉదయం పదిన్నర గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. ఆ తర్వాత అభిమానులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ భేటీకి రామ్ చరణ్ తేజ మీడియాను దూరంగా పెట్టారు. ఈ భేటీలో పవన్ జనసేన అంశంపై అభిమానుల నుండి చెర్రీ అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం.
అలజడి సృష్టిస్తామని ఎస్సెమ్మెస్‌లు!
మెగా కుటుంబంలో రాజకీయ చిచ్చు నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరగనున్న విశాఖ జనసేన పార్టీ సభలో అలజడి సృష్టిస్తామని చిరంజీవి వర్గం మెగా అభిమానులు ఎస్సెమ్మెస్ హెచ్చరికలు పంపించినట్లుగా తెలుస్తోంది. నిర్వాహకులకు వారు ఈ ఎస్సెమ్మెస్‌లు పంపించారట. దీంతో సభకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications