చిరు నుంచి బాబు వరకు: అస్త్రాలతో సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని అస్త్రాలతో 2019 ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు. దాదాపు ప్రతి విషయంలో ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పార్టీ విషయమై ఆయన ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

2019 ఎన్నికల్లో పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే కచ్చితంగా పార్టీ పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ లోపు తాను మరో రెండు మూడు సినిమాలను తీస్తానని చెప్పారు. తన వద్ద డబ్బులేదని, సినిమాల ద్వారా డబ్బులు సమకూర్చుకుంటానని చెప్పారు.

జనసేన

2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పన మరుసటి రోజే విజయవాడలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. వీరు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే విషయమై చర్చించారు. త్వరలో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు జనసేన, అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మీడియా

ఈ మధ్య రాజకీయ పార్టీలకు మీడియా తప్పనిసరిగా మారింది. పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రతి పార్టీకి మీడియా మద్దతు ఉంటుంది. కొన్ని పార్టీలకు మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పైన ఎవరూ తీవ్ర విమర్శలు చేయడం లేదు. కానీ రాజకీయ బరిలోకి దిగాక.. తమకు పోటీ అవుతాడని భావించాక ఆయా పార్టీలు, పార్టీల మీడియా సంస్థలు కచ్చితంగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంటాయి. దీనిని గుర్తించిన పవన్.. సొంతగా టీవీ ఛానల్ పెట్టాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పార్టీకి నిధులు

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో పొత్తు ఉంటుందా, ఒంటరిగా పోటీ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కు కూడా స్పష్టత ఉందని, కానీ ఆయన బయటకు చెప్పడం లేదని అంటున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రెండు మూడు సినిమాలు తీసి పార్టీ నడిపేందుకు నిధులు సేకరిస్తానని ఆయన చెప్పారు.

 Pawan Kalyan ready to fight 2019

విరాళాలు

సాధారణంగా ఎవరు పార్టీ పెట్టినా నిధులు బాగా వస్తాయి. ప్రజల్లో ఇమేజ్ ఉన్న వారు పార్టీ పెడితే విరాళాలు వెల్లువెత్తడం ఖాయం. 2019లో పవన్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగితే జనసేనకు విరాళాలు వెల్లువెత్తడం ఖాయమని చెబుతున్నారు.

చిరంజీవి విషయంలో పూర్తి స్పష్టత

తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు.. పవన్ తన సోదరుడి కోసం కాంగ్రెస్‌తో జత కలువవచ్చునని, అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూసుకునేందుకు ఏమైనా చేయవచ్చుననే ప్రచారం జరిగింది. కానీ, రాజకీయాల్లో తన అన్నయ్య దారి, తన దారి వేరు అని పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. తద్వారా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం ఆయనకు రాజకీయంగా మద్దతుగా ఉండలేనని, కుటుంబపరంగా మాత్రం అన్నయ్యనే తనకు అన్నీ అని చెప్పారు.

చంద్రబాబుతో తలపడతారా?

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు కూడా చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఓ కారణం. ఈ విషయాన్ని చంద్రబాబు, టిడిపి కూడా అంగీకరిస్తుంది. అయితే, 2019 ఎన్నికల్లో పవన్ ఆలోచన మరోలా ఉంటుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు పవన్ దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆ విషయంలో ఆయనకు పూర్తి స్పష్టత ఉందని, కానీ బహిర్గతం కావడం లేదని అంటున్నారు. అదే సమయంలో బిజెపితో స్నేహంగా ఉండేందుకే పవన్ ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు.

టిడిపికి కౌంటర్ ఎలా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా.. కొన్నిసార్లు ప్రశ్నించినా... తీవ్రస్థాయిలో పవన్ టిడిపి పట్ల వ్యతిరేకత కనబర్చడం లేదు. దీంతో టిడిపి నేతలు కూడా పవన్‌ను టార్గెట్ చేయడం లేదు. పవన్ తమకు వ్యతిరేకంగా బరిలోకి దిగితే... ఇప్పుడు జగన్‌ను, చిరంజీవి తదితరులను టార్గెట్ చేసినట్లే పవన్ కళ్యాణ్‌నూ టార్గెట్ చేస్తారు. వారికి సమాధానం చెప్పేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారనే భావించవచ్చు. తన మద్దతు వల్ల కూడా అధికారంలోకి వచ్చారని, అనుభవం ఉంది కాబట్టే చంద్రబాబుకు మద్దతు పలికామని, తాము ప్రశ్నిస్తేనే కొన్ని చేశారని జనసేన ఎదురు దాడికి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. తద్వారా టిడిపి నోరు మూయించేందుకు జనసేన సిద్ధంగా ఉందంటున్నారు.

వైయస్ జగన్

రానున్న ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినా జనసేన వద్ద సమాధానం ఉంటుంది. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడికి మద్దతిచ్చామని, ఆయన వైఫల్యం చెందినందు వల్లే దూరం జరిగామని చెప్పుకునే అవకాశం ఉంటుంది. జనసేన స్థాపించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా కలిసి వచ్చే అంశమే.

యువత, కాపు

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే యువత, కాపులు జనసేనకు మద్దతు పలుకుతారని లెక్కలు వేస్తున్నారు. పవన్ స్వయంగా తాను కులం రంగు అంటించుకోరు. అయినప్పటికీ ఆయన సామాజిక ఓట్లు ఆయనకు కచ్చితంగా పడతాయని అంటున్నారు. ఇందుకు 2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతివ్వడం వల్ల ఆ వర్గం ఓట్లు పడటమే నిదర్శనం అంటున్నారు. ఇక ఎలాగు యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణ, ఏపీ

తెలంగాణ, ఏపీలలో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి మాత్రం ఏపీ పైనే అని అంటున్నారు.

ఆవేశం

పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడే రకం. ఆయన తనలోని ఆవేదనను, ఆవేశాన్ని, బాధను బయటకు వెళ్లగక్కుతారు. నిజాయితీతో కూడిన ఆయన ఆవేశం, కొత్త పార్టీ, కుల రంగు, గత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అనుభవం.. పవన్ కళ్యాణ్‌కు మైనస్ అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+