TTD: తిరుమలలో దీక్ష విరమించిన పవన్ కల్యాణ్, కూతుర్లు !
తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
బుదవారం ఉదయం ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా పవన్ కల్యాణ్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి డిక్లరేషన్ బుక్కును శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పవన్ కల్యాణ్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

గొల్ల మండపంలో టీటీడీ అధికారులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. తరువాత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అనంతరం డిక్లరేషన్ బుక్ చేతిలో పట్టుకున్న పవన్ కల్యాణ్ శ్రీవారి ఆలయం నుంచి వెలుపలికి వచ్చారు. వారాహి డిక్లరేషన్ బుక్కు చేతిలో పట్టుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుండి నేరుగా శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు.
టీటీడీ శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యతను పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ కల్యాణ్ అన్న ప్రసాదం స్వీకరించారు. అక్కడనుండి పవన్ కల్యాణ్, ఆయన ఇద్దరు కుమార్తెలు నేరుగా తిరుమలలోని గాయత్రి నిలయానికి పెళ్లి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం తిరుపతి చేరుకుంటున్న పవన్ కల్యాణ్ తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్ లో ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించనున్నారు.
తిరుమలలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా టీటీడీ అధికారులు మీడియాపై ఆంక్షలు విధించారని మీడియా మిత్రులు నిరసన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర గొల్లమండపం వరకే మీడియా ప్రతినిధులు వెళ్లాలని అంక్షలు విధించారని, ఆ తర్వాత కూడా తరిగొండ శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోకి పవన్ కల్యాణ్ వెళ్ళిన సమయంలో అక్కడికి మీడియా ప్రతినిధులను అనుమతించలేదని మీడియా మిత్రులు ఆరోపించారు. కొంతమంది టీటీడీ అధికారులు కావాలనే మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారని మీడియా మిత్రులు ఆరోపించారు. అయితే ఈ విషయంపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications