Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రివర్స్ అయింది, దిమ్మతిరిగేలా: ఇదీ పవన్ క్యారెక్టర్ అంటూ వైసీపీ అభిమాని! (వీడియో)

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఆడియో విడుదల కార్యక్రమంలో తన మంచి మనసును చాటుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Recommended Video

    బాబు పై, అజ్ఞాతవాసి పై విరుచుకపడ్డ మహేష్ కత్తి

    పవన్ కళ్యాణ్ త్వరలో జనసేన బలోపేతంపై దృష్టి సారించనున్నారు. ఇటీవల ఏపీ పర్యటనలోను ఆయన జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఆ కారణమో, మరే కారణమో కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒకరు పవన్ క్యారెక్టర్ ఇది అంటూ ఓ పోస్ట్ పెట్టారు. అందులో అజ్ఞాతవాసి సమయంలో పవన్.. అభిమాని పట్ల స్పందన, అంతకుముందు ఓ సందర్భంలో పవన్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో పెట్టారు.

    పవన్ కళ్యాణ్ పైన పోస్ట్

    పవన్ కళ్యాణ్ పైన పోస్ట్

    ఆ పోస్టు పెట్టారు కానీ, అది ఎక్కడిది, ఏమిటి అనే విషయాలు స్పష్టంగా లేవు. దీంతో ఉద్దేశ్యపూర్వకంగా పెట్టినట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఎవరూ చూడనప్పుడు పవన్ కళ్యాణ్, అందరూ చూస్తుండగా పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్నారు. అయితే ఆ పోస్టులో కూడా పవన్ వెంట చాలా మంది ఉండటం గమనార్హం.

    దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అభిమాని

    దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అభిమాని

    ఈ వీడియోకు పెద్ద ఎత్తున అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్స్ వచ్చాయి. అయితే ఎక్కువగా వ్యతిరేక కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్ దానికి కౌంటర్ కామెంట్ పెట్టారు. సందర్భాన్ని బట్టి చూసుకోవాలని చురకలు అంటించారు. దేవుడు ప్రతిసారి నవ్వడని, పరిస్థితి అర్థం చేసుకోవాలని, తొలి వీడియో (పైన ఉన్న వీడియో) సమస్యల పరిష్కారం కోసం పోయినప్పటిది అయి ఉంటుందని, అలాంటి సమయంలో అది సెల్ఫీ టైమ్ కాదని, ఆడియో వేడుక వేరు అని కౌంటర్ ఇచ్చారు.

    పవన్ అభిమానులతో ఎలా ఉంటాడో తెలిపే సంఘటన

    పవన్ అభిమానులతో ఎలా ఉంటాడో తెలిపే సంఘటన

    కాగా, అభిమానులతో పవన్ ఎలా ఉంటాడో తెలిపే ఒక అరుదైన సంఘటన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో జరిగిన విషయం తెలిసిందే. ఆడియో రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    కంగారు పెట్టిన అభిమాని

    కంగారు పెట్టిన అభిమాని

    ఈ కార్యక్రమంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని వేదికపై హల్‌చల్ చేసి, అందరినీ కంగారు పెట్టాడు. మాట్లాడేందుకు పవన్ వేదికపైకి చేరుకోగానే ఓ అభిమాని వచ్చి ఆయన కాళ్లపై పడ్డాడు. అంతలోనే తేరుకున్న సిబ్బంది.. అభిమానిని కిందికి లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశారు.

    వీడియోకు కౌంటర్‌గా

    వీడియోకు కౌంటర్‌గా

    వెంటనే స్పందించిన పవన్.. వారందరిని వారించి వేదిక పైనే అభిమానితో మాట్లాడాడు. అంతేకాదు అతడితో ఒక సెల్ఫీకి కూడా ఫోజిచ్చాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ అంటే తమకు ఎందుకు ఇష్టమో ఈ వీడియో చూడండంటూ అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా ఆ వీడియో పెట్టారు. కానీ సందర్భం చూసుకోవాలని కొందరు కౌంటర్ ఇస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+