NTR ట్రస్ట్ కు భారీ విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ వైపు ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్. NTR ట్రస్ట్ కు భారీ విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం అందించారు. ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు తన మాట నిలబెట్టుకున్నారు పవన్ కల్యాణ్.
పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తనదైన సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేకాక ఇంటి వద్దనే రూ. 5000 పంపిణీ చేస్తామని ప్రకటించారు.

తాజాగా పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్ల కోసం తన వంతు సాయం చేశారు. తన సొంత నిధులతో సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. జూన్ 8న 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేశారు. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్. NTR ట్రస్ట్ కు భారీ విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం అందించారు.
ఈ విషయాన్ని NTR ట్రస్టు అధికారికంగా ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితుల కోసం యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరిపింది. తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా ఉండేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో తలసేమియా చిన్నారుల కోసం రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, తన మాట ప్రకారం విరాళాన్ని చెక్క్ రూపంలో అందజేశారు.#PawanKalyan #Thalassemia #DonateNow #NTRTrust pic.twitter.com/B0uHMAl3E6
— NTR Trust (@ntrtrust) June 9, 2025
అయితే ఆ సమయంలో తలసేమియా బాధితుల కోసం NTR ట్రస్ట్ కు విరాళం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. తాజాగా రూ. 50,00,000 అందజేసి తన మాట నిలబెట్టుకున్నారు పవన్ కల్యాణ్. పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు చెక్ రూపంలో అందించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది.












Click it and Unblock the Notifications