జనసేన పొత్తుల సంగతేంటి?...పవన్ కళ్యాణ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదా?
విజయవాడ:పొత్తులపై జనసేన పయనమెటు?...ఆ పార్టీ వైసిపితో పొత్తు పెట్టుకుంటుందా?...ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటివరకూ స్పష్టమైన సమాధానం రాలేదు.
పొత్తులు ఉంటాయని...జగనసేన వైసిపితో పొత్తు పెట్టుకుంటుందని కొందరు అభిప్రాయపడుతుండగా...జనసేన పార్టీలోని అత్యధికులు మాత్రం పొత్తు వద్దనే అంటున్నారట. అందుకు వైఎస్ జగన్ పట్ల విముఖత కారణం అని కాదు గాని జనసేన పార్టీ భవిష్యత్తు దృష్ట్యా పొత్తు వద్దనేది వారి అభిప్రాయమట. దీంతో పొత్తుతో ముందుకు వెళదామనుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మళ్లీ డైలమాలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే...

జనసేన పొత్తులు...పొడిచేనా?
2014 ఎన్నికల్లో టిడిపికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపితో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగానే తలపడవచ్చని దాదాపు ఖాయం అయింది. ఈ క్రమంలో జనసేన వెనుక బీజేపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

పొత్తులపై...అంతర్మథనం
అంతేకాదు ఇటీవల పవన్ కల్యాణ్ పై విమర్శల జోరు మరింత పెంచిన టిడిపి నేతలు 2019 ఎన్నికల నాటికి జనసేన, వైసీపీల మధ్య పొత్తు కుదురుతుందని వారికి బిజెపి సపోర్ట్ ఉంటుందని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై మిగిలిన రాజకీయ పక్షాల సంగతి ఎలా ఉన్నా జనసేన లోనే అంతర్మథనం జరుగుతోందని తెలుస్తోంది. ఆ పార్టీలో ఎక్కువమంది...పొత్తులు వద్దని ఒంటరిగానే పోటీ చేద్దామని వాదిస్తున్నట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తు కోసమే తాము నొత్తును వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారట.
Recommended Video


ఆ తరువాత...జరిగేది అదేనా?
పవన్ కళ్యాణ్ 2014 నాటి ఎన్నికల్లో టిడిపి మద్దతు ఇవ్వడం వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే వైసిపి అధికారంలోకి వస్తుంది. అది ఆ పార్టీకే లాభం కానీ జనసేనకు ఏ విధంగా ప్రయోజనం...ఇలా ఒకసారి ఆ పార్టీని...మరోసారి ఇంకోపార్టీని గెలిపిస్తే మనం ఎదిగేది ఎప్పుడు?''...అని జనసేన లోని ముఖ్యనేతలు, సీనియర్ నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారట. అంతేకాదు కొందరు ఏకంగా ఈ వాదన పవన్‌కల్యాణ్ కే వినిపించారని అంటున్నారు.

పవన్...ఇంకా నో క్లారిటీ
2019 ఎన్నికల్లో ఈసారి వైసీపీకి మద్దతిస్తే...జగన్ సీఎం అయితే ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే మళ్లీ టిడిపి అధికారంలోకి...జగన్ బాగా చేస్తే మళ్లీ అతడే అధికారంలోకి రావడం జరుగుతుందని...అలా మళ్లీ మనకి ప్రతిపక్ష పాత్రే మిగులుతుందనీ కొందరు ముందుచూపున్న జనసేన నేతలు అంత దూరం ఆలోచించి మరీ వాదిస్తున్నారట. అదే ఇప్పడే సొంతంగా పోటీచేస్తే కర్ణాటకలో జేడీఎస్ ఎలాగ చక్రం తిప్పిందో...సిఎం సీటు ఎలా సొంతం చేసుకుందో అదే తీరుగా జనసేనకే సిఎం సీటు దక్కొచ్చని ఆ పార్టీ నేతల వాదనట. దీంతో పొత్తులపై పవన్ ఎటూతేల్చుకోలేక తెగ ఆలోచిస్తున్నారని టాక్.












Click it and Unblock the Notifications