'స్థానిక'తో పవన్ వస్తారా?: నటుడిగా బిజీగా ఉంటూ.., ఫ్యాన్స్ రెడీ

న్యూఢిల్లీ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఆయన ఏం చేయనున్నారనే చర్చ సర్వత్రా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని జనసేన ఈసీని కోరింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ-టీడీపీతో కలిసి వెళ్లవచ్చునని అంటున్నారు.

నటుడిగా బిజీగా ఉంటూనే...

Pawan Kalyan’s Janasena gets Election Commission’s approval

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి విస్తృతంగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీనిపై విపక్షాల నుండి విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబును, మోడీని నిలదీస్తానన్న పవన్ ఇప్పుడేం చేస్తున్నారని పలువురు ప్రశ్నించారు.

దీనిపై జనసేన సమాధానం కూడా ఇచ్చింది. ఈసీ నుండి పార్టీకి గుర్తింపు వచ్చాక పవన్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, మోడీ పనితీరుపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, పవన్ ఓ వైపు నటుడిగా బిజీగా ఉంటూనే పార్టీ పైన దృష్టి పెట్టారు. అందులో భాగంగానే పార్టీకి ఈసీ గుర్తింపు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

Pawan Kalyan’s Janasena gets Election Commission’s approval

నాలుగేళ్ల సమయం... వెంట అభిమాన గణం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు అప్పటి వరకు పార్టీ బలోపేతం పైన దృష్టి సారించవచ్చు. పవన్ వెంట ఆయన అశేష అభిమాన గణం కూడా ఉంది.

పవన్‌కు సమాజానికి ఏదో చేయాలనే తపన, రాజకీయాల పైన అవగాహన, దూరదృష్టి ఉందని చెబుతుంటారు. సమాజానికి సేవ చేయాలనే ఆయన తపనకు ఆయన ఇమేజ్ బాగా పనికి వస్తుందని చాలామంది భావిస్తున్నారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా గతంలో ఇది చెప్పారు.

పవన్ కల్యాణ్‌ను వ్యతిరేకించాలనుకునే వారు ఆయన పైన కేవలం వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తారని, దాని కూడా ధీటుగా సమాధానం చెప్పగల వ్యక్తి పవన్ అంటున్నారు. ఇప్పటికే తన పైన వ్యక్తిగత విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానం చెప్పి నోరు మూయించే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+