జూ ఎన్టీఆర్‌పై పవన్‌కళ్యాణ్ పంజా, ఇద్దరికీ ఫ్యాన్స్ అండ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి సహ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టారంటున్నారు. జూనియర్ తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నారనే విషయం తెలిసిందే. దీంతో, ప్రస్తుతానికి జూనియర్ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతానని చెప్పినప్పటికీ... 2019 ఎన్నికల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు పవన్ పార్టీ పెడుతుండటం జూనియర్‌కు దెబ్బే అంటున్నారు. సినిమాల పరంగానే ఎవరి అభిమానులు వారికి. రాజకీయాల్లోకి వస్తే అంతా తారుమారు అవుతుంది. 2019లో జూనియర్ తన తండ్రి నందమూరి హరికృష్ణతో కలిసి పార్టీ పెట్టేందుకు యోచన చేశారట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ పార్టీ పెట్టడం గమనార్హం. రాజకీయాల్లో సినీ గ్లామర్ కొంతమేరకే పని చేస్తుందనే వాదన ఉంది.

Pawan Kalyan's Panja on Jr NTR

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ, ఇప్పటికీ అన్నింటిలో మార్పు ఉంది. టిడిపి ఆవిర్భావం సమయంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. బాగా గ్లామర్ ఉన్న ఓ నటుడు రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ పెట్టడం అదే ప్రథమం. గ్లామర్ అంతగా పని చేయదని ఎన్నో సందర్భాల్లో నిరూపితం అయింది. ప్రజారాజ్యం పెట్టే వరకు చిరు టాలీవుడ్లో తిరుగులేని నటుడు. అలాంటి చిరు స్వయంగా పాలకొల్లులో ఓడిపోయారు. కొందరు ప్రముఖ నటులే కాకుండా... చిన్న చిన్న నటులు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మరోవైపు రాజకీయాల్లో యువ ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో రాజకీయాలు అంటే అంతగా తెలిసేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారు. పవన్ పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో తెలియనప్పటికీ... జూనియర్‌కు మాత్రం ఇది దెబ్బే అంటున్నారు.

ఎన్టీఆర్, చిరు, పవన్... ఇలా వరుసగా పార్టీలు పెట్టి క్రమంగా ఇమేజ్ కోల్పోయారంటున్నారు. పవన్‌తో అది తారాస్థాయికి చేరుకుంటుందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో జూనియర్ పార్టీ పెట్టినా అంతగా ఉపయోగం ఉండదని అంటున్నారు. కాగా, పవన్ పార్టీ ప్రభావం చూపితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసే అవకాశం లేకపోలేదంటున్నారు.

నాడు జూనియర్‌కు.. నేడు పవన్‌కు

టిడిపిలో విభేదాలు వచ్చినప్పుడు చాలామంది నందమూరి అభిమానులు జూనియర్ వెంట నిలిచారు. ఇప్పుడు పవన్ విషయంలోను అలాగే జరుగుతోంది. చంద్రబాబు, బాలకృష్ణలతో పొసగని జూనియర్ పోయిన ఏడాది విజయవాడలో ఓ షోరూం ప్రారంభోత్సవ సమయంలో బల ప్రదర్శన చేశారంటారు. అప్పుడు ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు చిరంజీవి అభిమానులను హెచ్చరిస్తున్నప్పటికీ ఫ్యాన్స్ ఎక్కువమంది పవన్‌కే జైకొట్టేందుకు మొగ్గు చూపుతున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+