రాజకీయాలపై పవన్ ఏం చెప్తారు?: చిరుతో విభేదాల్లేవు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మార్చి రెండో వారంలో రాజకీయాల పైన తన అభిప్రాయాల్ని వెల్లడించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. పవన్ తన రాజకీయ ఆలోచనల గురించి ఈ నెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంలో రాజకీయాలపై తనకున్న అభిప్రాయాలను, పార్టీ, ఎన్నికల్లో పోటీ గురించి చెప్పబోతున్నారట.
ఈ నెల రెండో వారంలో పవనే స్వయంగా తెలియజేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మే నెల ఆఖరువారంలో షూటింగ్ ప్రారంభం కానున్న గబ్బర్ సింగ్ - 2 చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో, ఓ మైగాడ్ రీమేక్ కథా చర్చల్లోనూ పూర్తిగా నిమగ్నమై ఉన్నారని పవన్ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.

చిరుతో మనస్పర్థల్లేవు
కొంతకాలంగా సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో పవన్ కల్యాణ్ విభేదిస్తున్నారని కూడా ప్రచారం ఉంది. శివరాత్రి రోజున నాగబాబు తనయుడు వరుణ్ తేజ చిత్రం ప్రారంభోత్సవం సమయంలో చిరు, పవన్‌లు మాట్లాడుకోలేదనే విషయం చర్చనీయాంశమైంది. దీనిపై తెరదించే ప్రయత్నాలు చేశారు. చిరంజీవితో ఎలాంటి మనస్పర్థలు లేవని ఆ ప్రకటనలో తెలిపారు.
ఏం చెబుతారు?
వన్ ఏం చెబుతారనే ప్రశ్న అందర్నీ తొలచి వేస్తోంది. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ రాజకీయ నాయకుల పైన కొద్దిగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చెబుతారనే చర్చ సాగుతోంది. అన్నయ్యను కాదని కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉండక పోవచ్చునని అంటున్నారు. తనకు అన్నయ్యతో విభేదాల్లేవని, అన్నయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటానని పవన్ చెప్పే అవకాశాలున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications