సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ తీపి కబురు అందింది. పవన్‌ కళ్యాణ్‌ వారసుడు రేణు దేశాయ్‌ కుమారుడు అకీరా తెరంగేట్రం చేసేస్తున్నాడు. వాళ్ళ అమ్మ మరాఠీలో నిర్మిస్తున్న 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే చిత్రంలో అకీరానందన్‌ ఓ చిన్న పాత్ర పోషిస్తున్నాడు.

ఈ విషయాన్ని రేణు దేశాయ్‌ ట్వీట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజైన ఈ రోజే ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం. ఇప్పటికే మెగా అభిమానులు హీరోలుగా వరుస కడుతున్నారు. ఇప్పుడు వారి కోవలో మరో వారసుడు తయారవుతున్నాడు. అకీరా అతిథి పాత్ర పోషిస్తున్నాడు. తాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా అకీరా సినిమా రంగంలోకి ప్రవేశించడం ఎంతో ఆనందంగా ఉందని రేణూ దేశాయ్ ట్విట్టర్‌లో రాశారు.

Pawan Kalyan's son enters films

మంగళవారంనాడే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్‌ విడిగా వుంటున్నా, పవన్‌ కళ్యాణ్‌పై వున్న ప్రేమతో ఈ రోజే పెట్టడం విశేషం సంతరింతరించుకుంది. పవన్ కళ్యాణ్‌కు తెలుగులో విశేషమైన అభిమాన సంపద ఉంది.

పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+