బాలకృష్ణ సినిమా చూస్తే: పవన్ వారిని అప్‌సెట్ చేశారా?

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని అప్ సెట్ చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ తీరుపై సీమాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కాపు సామాజికవర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. పవన్ కళ్యాణ్ తమ సామాజికవర్గం వ్యతిరేకుల చేతుల్లో పావుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

బిజెపి, టిడిపిలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలబడటాన్ని ఆ సామాజికవర్గంలోని చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవితో పోటీపడి మరీ పవన్... టిడిపి, బిజెపిలకు మద్దతు పలుకుతున్నారని, ఇది జీర్ణించుకోలేని విషయమని చెబుతున్నారట.

Pawan Kalyan’s support for Chandrababu upsets Kapus

కాపు సామాజికవర్గాన్ని దెబ్బతీసే వారితో పవన్ కళ్యాణ్ చేతులు కలపడం విడ్డూరమని విపక్ష నేతలు కూడా ఆయనను తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ టిడిపి నేత బాలకృష్ణ చిత్రాలు చూస్తే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

బాలకృష్ణ పలు చిత్రాల్లో పరోక్షంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేసి డైలాగులు కొట్టారని గుర్తు చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కాపు సమైక్యతను దెబ్బతీస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాపు నేతలు ఆరోపిస్తున్నారట. అయితే, కాపులు ఇప్పుడు టిడిపి వైపుకు మొగ్గుతున్నారని, వారు తమ వైపే ఉన్నారని టిడిపి చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+