చెగువేరా ప్రభావం: కూతురు ఫొటో పెట్టిన పవన్, ‘ఒక మాదిగ మహనీయుడి చెప్పుల దుకాణంపై..’

Recommended Video

    సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ పోస్ట్

    హైదరాబాద్‌: అర్జెంటీనా మార్క్సిస్ట్, క్యూబా విప్లవకారుడు చేగువేరా అంటే జనసేన పార్టీ అధినేత, ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఎంత అభిమానమో తెలిసిన విషయమే. పలు సినిమాల్లో చెగువేరా ఫొటోను కూడా పవన్ ఉపయోగించారు.

    కాగా,శనివారం చెగువేరా విగ్రహం పక్కన తన కుమార్తె పొలినా అంజని దిగిన ఫొటోను పవన్ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. చెగువేరా ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని పవన్ తెలిపారు.

    చెగువేర చెంత పవన్ కూతురు

    చెగువేర చెంత పవన్ కూతురు

    ఇది సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ మ్యూజియంలో తన కుమార్తె చేగువేరా మైనపు విగ్రహంతో దిగిన ఫొటో అని పవన్ చెప్పారు. నెల్లూరులో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు చెగువేరా జీవితం గురించి చదివానని, ఇప్పటికీ చదువుతున్నానని తెలిపారు. ఆయన ప్రభావం తన జీవితంపై ఉందని చెప్పారు.

    పీడిత ప్రజలకు అండగా..

    పీడిత ప్రజలకు అండగా..

    ప్రపంచంలో అరాచకం, దోపిడీ, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు.. నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ.. నీకు వ్యక్తిగతంగా ఏమి జరగనప్పటికీ.. నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలి అనే విషయాన్ని నేను చేగువేరా జీవితం నుంచి నేర్చుకున్నా' అని పవన్ తెలిపారు.

    నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి..

    నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి..

    ‘జీవితం అంతిమ క్షణాల వరకూ తాను నమ్మిన సిద్ధాంతంతోనే నడిచి చూపించిన విశ్వనరుడు చేగువేరా' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    చెప్పుల దుకాణంపై..

    ‘అందుకేనేమో దశాబ్దాల క్రితం, ఎక్కడో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చేగువేరా చిత్రం ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరినట్టుండే ఇచ్ఛాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే వీధికి ఎదురుగా ఒక మాదిగ మహనీయుడి చెప్పుల దుకాణంపైన నాకు దర్శనమిచ్చింది' అని పవన్‌ పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+