జనం కోసం జనసేన, ప్రజల కోసం పనిచేస్తాం, పవన్ కల్యాణ్
ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు సేవ చేసే విషయంలో గతంలో వైసీపీ నాయకులు నిర్లక్ష్యం చేశారని, మా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల విషయంలో నిర్లక్షం చెయ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేనలో ఇతర పార్టీల నాయకులు చేరడం వలన మాకు విశ్వాసాన్ని మరింత పెంచాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ముద్రగడ క్రాంతి, గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, జగ్గయ్యపేటకు చెందిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అందరికీ జనసేన కండువాలు కప్పిన పవన్ కల్యాణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గుడివాడ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలలు చేపట్టాలని, నిధులు మంజూరు చేశామని, నీటి పరీక్షలు నిర్వహించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు కావలసిన కనీస అవసరాలు తీర్చడానికి కూటమి కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖలో అవినీతి అనే పదానికి చోటు లేకుండా చేస్తామని, అధికారులు ఎవరైనా లంచం అని అడిగితే వారిని ఇంటికి పంపిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని, గతంలో పంచాయితీరాజ్ శాఖలో ఎన్నడు లేని విధంగా పని చేస్తుందని, ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ ల్యాళ్యాణ్ అన్నారు. అవినీతికి ఆస్కారమే లేకుండా పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు చేశామని పవన్ కల్యాణ్ చెప్పారు.

కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా వాటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు జరిగాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని వస్తే వాళ్ల దగ్గర లంచాలు అడిగితే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో లంచం అనే పదాలకి చోటు లేకుండా చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పార్టీ పైన నమ్మకంతోనే ఇతర పార్టీలోని నాయకులు వచ్చి చేరుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications