సంక్రాంతి పండగకు పవన్ కళ్యాణ్ ఆకాంక్షలు ఇవే
తెలుగు ప్రజలకు ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలుగు ప్రజలకు ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షింగా ఉండాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.
సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా పండగ తీసుకురావాలని కోరుకున్నారు. నోట్ల రద్దు వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దల నుంచి కాపాడాలని వపన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేగాక, ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలగజేయాలని పేర్కొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్ఛాపురంలో ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆయన చొరవతో ప్రభుత్వం కూడా ఉద్దానం సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది.












Click it and Unblock the Notifications