చాలా ఆలస్యం, ఆమరణ దీక్ష టైం వదిలేయండి: బాబు ఢిల్లీ టూర్‌పై పవన్, లోకేష్‌కు దిమ్మతిరిగే కౌంటర్

Recommended Video

    లంచాలు తీసుకొని రసీదులు ఇవ్వరుగా : పవన్ కళ్యాణ్

    అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చాలా ఆలస్యం అయిందని జనసేన అధఇనేత పవన్ కళ్యాణ్ బుధవారం అన్నారు. ఆయన లెఫ్ట్ పార్టీ నేతలతో విజయవాడలో భేటీ అయ్యారు. విభజన హామీలపై పోరుబాటకు నిర్ణయించారు.

    విజయవాడలోని జనసేన కార్యాలయంలో సీపీఎం, సీపీఐ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యమ కార్యాచరణపై సీపీఎం రామకృష్ణ, సీపీఐ మధు తదితరులు జనసేనానికి వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 6న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

     హోదా కోసం ఏప్రిల్ 6న నిరసన దీక్షలు

    హోదా కోసం ఏప్రిల్ 6న నిరసన దీక్షలు

    హోదా కోసం ఏప్రిల్ 6న రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పవన్ విజయవాడలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ అవిశ్వాసంపై మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కూడబలుక్కొని అవిశ్వాస తీర్మానంపై చర్చకు రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు. త్వరలో తాను అనంతపురం, ఒంగోలు, ప్రకాశం జిల్లా మేధావులతో మాట్లాడుతానని చెప్పారు.

    బాబు పర్యటన చాలా ఆలస్యం

    బాబు పర్యటన చాలా ఆలస్యం

    సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చాలా ఆలస్యమైందని పవన్ చెప్పారు. గతంలోనే ఆయన ఢిల్లీకి వెళ్తే బాగుండునని తెలిపారు. చాలా సంవత్సరాల క్రితమే వెళ్లవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. హోదా కోసం చేపడతానన్న ఆమరణ దీక్షపై మాట్లాడుతూ.. దీక్షపై సమయం తనకు వదిలేయాలన్నారు. మంత్రి లోకేష్, టీడీపీ నేతలపై ఆరోపణల గురించి స్పందిస్తూ.. జనం అనుకున్నది తాను చెప్పానని, లంచాలు తీసుకొని రసీదులు ఇవ్వరుగా అని కౌంటర్ ఇచ్చారు. గతంలో లోకేష్, టీడీపీ నేతల లంచాలపై పవన్ మాట్లాడారు. దానికి టీడీపీ నేతలు స్పందిస్తూ.. అన్నింటికి కాగితాలు ఉన్నాయని, అవినీతి జరగలేదని చెప్పారు. దానికి కౌంటర్‌గా పవన్ లంచాలు తీసుకున్నప్పుడు అవినీతి ఇవ్వరని గట్టి కౌంటర్ ఇచ్చారు.

    ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదు

    ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదు

    సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ... ఏపీ అంటే అమరావతి, పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాదని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. అంతా ఒకేచోట అభివృద్ధి జరుగుతోందని ఆరోపించారు. దీంతో వెనుకబడిన జిల్లాలు ఆందోళనలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ నమ్మకద్రోహానికి నిరసనగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

    కేంద్రం దిగి రావాలి, హోదా ఇవ్వాలి

    కేంద్రం దిగి రావాలి, హోదా ఇవ్వాలి

    ఎల్లుండి పది గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని సీపీఎం మధు చెప్పారు. బీజేపీ చేసిన తప్పులలో టీడీపీకి కూడా బాధ్యత ఉందన్నారు. కేంద్రం దిగి రావాలని, హోదా ప్రకటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పు, భారత్ బంద్ అంశంపై మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పును కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+