టిడిపి నేతగా రాలేదు: పవన్ కళ్యాణ్ షాకివ్వడంతో ఎమ్మెల్యే, ఫ్యాన్స్‌కూ..
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు తిరుపతి బహిరంగ సభ సమయంలో, అంతకుముందు ఇటు అభిమానులకు, అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఝలక్ ఇచ్చారు!
ఉదయం పవన్ కళ్యాణ్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన తిరుపతి సభకు బయలుదేరారు. పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఆయన కిందపడపోయారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తో తిరుపతి టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ భేటీ అయ్యారు. తొలుత ఆయన నుంచి ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె కొంచెం సేపు వేచి చూశారు. తాను టిడిపి తరఫున రాలేదని, మీ అభిమానిగా వచ్చానని చెప్పడంతో పవన్ ఆమెను లోనికి అనుమతించారు.

అభిమానుల నినాదం పట్టించుకోని పవన్ కళ్యాణ్
తిరుపతిలోని ఇందిరా మైదానం వేదికగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర నినాదాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా ఆయన అభిమానులు అభివర్ణించారు. అయితే ఈ నినాదాలు తన చెవిన పడ్డా కూడా పవన్ కళ్యాణ్ మౌనం దాల్చారు.
పలుమార్లు అభిమానులు చేసిన నినాదాలకు ఆయన స్పందించారు. కానీ పవన్ సీఎం అంటూ చేసిన నినాదాలకు మాత్రం ఆయన స్పందించలేదు. ఈ సభకు తిరుపతి నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జనాన్ని చూసి రెట్టించిన ఉత్సాహంతో ఏపీకి ప్రత్యేక హోదాపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఆయన వేదిక దిగుతున్న సమయంలో జనం నుంచి 'సీఎం పవర్ స్టార్', 'జై పవనిజం' అంటూ పెద్ద పెట్టున నినాదాలు వినిపించాయి. ఆ నినాదాలను విన్నా, విననట్టే ఆయన వెళ్లిపోయారు.
-
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?











Click it and Unblock the Notifications