నాకు వైసిపియే ప్రధాన ప్రత్యర్ధి : 2018 తరువాత టిడిపి లేదు : పవన్ కళ్యాన్ సంచలనం...!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 2018 తరువాత టిడిపి లేదని తేల్చి చెప్పారు. ఈ ఎన్నిక ల్లో ప్రధాన పోటీ వైసిపి తో అంటూ తేల్చి చెప్పారు. గాజువాక..భీమవరం రెండు నియోజకవర్గాల్లో తాను గెలుస్తానంటూ పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార వేళ రాజ కీయంగా వేడి పుట్టిస్తున్నాయి.

వైసిపి యే ప్రధాన ప్రత్యర్ధి..
జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు 2018 నుండే టిడిపి లేదని..కేసీఆర్ టిడిపి సైకిల్ చైన్ తెంచే సారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమకు రాజకీయ ప్రత్యర్ధి వైసిపి నే అంటూ వ్యాఖ్యానించారు. ఇక వైపు టిడిపి కి పవన్ మద్దతు దారుడిగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ తన ప్రచారంలో ఎక్కడా పవన్ పేరెత్తకుండా యాక్టర్..పార్టనర్ అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, ఏపి లో ఎన్నికలు వైసిపి..టిడిపి మధ్యే అంటూ వైసిపి నేతలు చెబుతున్నారు. జనసేన ను పార్టీగా..పవన్ కళ్యాన్ ను రాజకీయ నేతగా గు ర్తింటానికి కూడా కొందరు వైసిపి నేతలు ముందుకు రావటం లేదు. అయితే, ఇప్పుడు జనసేన అధినేత చేసిన వ్యాఖ్య లతో ఎన్నికల వేళ కొత్త చర్చ కు తెర లేచింది.

టిడిపికి నష్టం చేస్తాయా..
జనసేన ఎవరితో పొత్తు లేకుండా పోఈ చేయటం ద్వారా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టిడిపికి మేలు జరుగుతుందనే చర్చ ఉంది. ఇదే అంశాన్ని వైసిపి నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే, ఇప్పుడు సడన్ గా పవన్ చేసిన వ్యాఖ్యలు టిటిడిపి ఆత్మరక్షణలో పడేసాయి. అసలు టిడిపి యే లేదని..ఎన్నికలు తమ రెండు పార్టీల మధ్యే అంటూ పవన్ చెప్పటం టిడిపి నేతలకు రుచించటం లేదు. టిడిపి నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా పవన్ ను పెద్దగా విమర్శించటం లేదు. నేరుగా జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పవన్ అసలు టిడిపి లేదనే విధంగా వ్యాఖ్యానించటం పై టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారు. ఇది యాధృచ్చికంగా చేసిన కామెంట్లా.. లేక ఉద్దేశ పూర్వకంగానే టిడిపి కి నష్టం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడారా అనే కోణం చర్చలు చేస్తన్నారు. అయితే, పవన్ అసలు టిడిపి లేదని ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించటాన్ని మాత్రం తిప్పి కొట్టాలని టిడిపి నేత లు డిసైడ్ అయ్యారు.

అసలు పరమార్దం ఏంటి..
పవన్ అసలు టిడిపి లేదంటూ చెప్పటం..ఎన్నికల్లో తమకు వైసిపి అసలు ప్రత్యర్ధి అంటూ పవన్ చెప్పటం వెనుక అసలు పరమార్ధం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా సాగుతున్న చర్చ. టిడిపి పై వ్యతిరేకత ఉందని గుర్తించే ఆ ఓట్లు తనకు బదిలీ అయ్యేలా చేయటం కోసమే పవన్ ఇలా వ్యాఖ్యానించారా అని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. టిడిపి వ్యతిరేక ఓట్లు జగన్ వైపు వెళ్లకుండా చూడటానికే ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే అనుమానం వ్యక్తం అవుతోంది. తాను టిడిపిని ప్రచారం లో విమర్శించటం లేదనే ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. కదలని సైకిల్ ను ఏం తిడతానంటూ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు టిడిపికి నష్టం చేసే విధంగా ఉన్నాయని..ఖచ్చితంగా ఇది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications