గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా-వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్-బీజేపీకి గుడ్ బై సంకేతాలు ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తీవ్ర స్దాయిలో రెచ్చిపోయారు. వైజాగ్ ఘటనల తర్వాత విజయవాడ చేరుకున్న ఆయన ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్.. వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తాను బాపట్ల ఉప్పూ, కారం తిని వచ్చానని, వైసీపీ నేతలు తనతో వార్ కు దిగితే ఎలా ఉంటుంందో ఇవాళ్టి నుంచి చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు.

ఎనిమిదేళ్లలో 6 సినిమాలు-120 కోట్లు

ఎనిమిదేళ్లలో తాను కేవలం 6 సినిమాలు చేశానని పవన్ కళ్యాణ్ ఇవాళ తెలిపారు. వీటి ద్వారా రూ.100 నుంచి రూ.120 కోట్లు సంపాదించానన్నారు. జీఎస్టీకాకుండా 34 కోట్ల 4 లక్షల 876 రూపాయలు పన్ను కట్టానన్నారు. పిల్లల కోసం చేసిన ఫిక్సెడ్ డిపాజిట్ తీసేసి పార్టీ ఆఫీసు కట్టాను. హుద్ హుద్ తుపాను నుంచి సైనిక్ ఫండ్, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కలిపి 12 కోట్లు ఇచ్చానన్నారు. 30 లక్షల రూపాయలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నిధులిచ్చానని తెలిపారు. జనసేన ఐదు బ్యాంకు అకౌంట్లలో 17 కోట్ల 58 లక్షలు పార్టీ కార్పస్ ఫండ్ గా ఉందన్నారు. రైతు భరోసా కోసం 3 కోట్లు ఖర్చుపెట్టానని పవన్ తెలిపారు. నాసేన కోసం-నా వంతు ద్వారా 4 కోట్ల 32 లక్షల విరాళాలు వచ్చాయన్నారు.

ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా

తనను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తున్న వైసీపీ నేతలపై పవన్ తీవ్రంగా రెచ్చిపోయారు. తనను ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి నాకొడుకుల్ని చెప్పుతీసుకుని దవడ పగిలేలా కొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే పళ్లు రాలగొడతానని చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఏరా వైసీపీ గూండాల్లారా మీ దగ్గర క్రిమినల్స్, రౌడీలు ఉన్నారా ఒంటిచేత్తో వచ్చి మెడ తొక్కిపడేస్తానంటూ పవన్ రెచ్చిపోయారు. సన్నగా ఉంటాను, ఏమీ చేయలేనని అనుకోకండన్నారు.

 మీరూ మూడు పెళ్లిళ్లి చేసుకోండి

మీరూ మూడు పెళ్లిళ్లి చేసుకోండి

తాను వీధి బళ్లో చదువుకున్నానని, నా భాష తెలుసారా మీకు అంటూ తీవ్ర పదజాలంతో పవన్ రెచ్చిపోయారు. మాట్లాడితే మూడు పెళ్లి చేసుకున్నానంటున్నారని, మీరూ చేసుకోండన్నారు. తాను ఏ పరిస్ధితుల్లో మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో కూడా పవన్ వివరించారు. తనలా కాకుండా ఒకళ్లను పెళ్లిచేసుకుని 30 స్టెప్నీల్ని పెట్టుకునే సన్నాసులు అంటూ వైసీపీ నేతల్ని విమర్శించారు. మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు పక్కన నా తండ్రి కానిస్టేబుల్ గా డ్యూటీ చేశారన్నారు. తాను ఈ ప్రాంతం నుంచే వచ్చానన్నారు.

 రాళ్లతో వచ్చినా, రాడ్లతో వచ్చినా..

రాళ్లతో వచ్చినా, రాడ్లతో వచ్చినా..

వైసీపీలో బాలినేని, ఆనం వంటి మర్యాదగా మాట్లాడే వాళ్లను వదిలిపెట్టి మిగతా రెచ్చిపోతున్న వాళ్లను నిల్చోబెట్టి తోలువలుస్తానని పవన్ హెచ్చరించారు. నాకు రాజకీయంతెలియదనుకున్నారా.. మీరు చేసేవి క్రిమినల్, అవకాశవాద రాజకీయాలని, తాను మాత్రం సిద్ధాంతాల ప్రకారమే పని చేస్తానన్నారు.రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతులా.. ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యే గూండా కొడుకులు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తానన్నారు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ మంచితనం, సహనం చూశారని, సహృదయం చూశారని, ఇప్పటి నుంచి అలా ఉండబోదన్నారు. ఈరోజు నుంచి యుద్ధమేనన్నారు.

 వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు వార్నింగ్

వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు వార్నింగ్

పనికి మాలిన మాటలు వాగే కాపు ఎమ్మెల్యేలకు .. మీలో మీ నాయకుడికి అడుగులకు మడుగులు ఒత్తుకుంటే తప్పులేదని, కులాన్ని తక్కువ చేసి మాట్లాడొదని పవన్ సూచించారు. బంతి, చామంతి, పూబంతి నీ పని నువ్వు చూసుకో అన్నారు. ఏమయ్యా కొట్టూ నువ్వు కొట్లో కూర్చో అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

తనకు రాజకీయం తెలియదంటున్నావని, అదెలా ఉంటుందో నీకు చూపిస్తానన్నారు.తనతో పిచ్చివాగుడు వాగొద్దన్నారు. కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తానన్నారు. కాపులకు పెదన్న పాత్ర వహించాలని ఊరికే చెప్పలేదని, బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

కన్నమనీడు అనే మాలవీరుడిని పల్నాడు బ్రహ్మనాయుడు ప్రధాన సేనాథిపతిని చేశాడన్నారు. ఆయన వద్ద అన్ని కులాల వారు ఉండేవారని, అందుకే చాపకూడు సిద్ధాంతం అమలుచేశారన్నారు. ఒక్క కులం వల్ల ఎవరూ ముందుకెళ్లలేరన్నారు. ఒకరు ఎదగాలంటే మరో కులాన్ని తొక్కితే సాధ్యంకాదన్నారు.

వైజాగ్ స్టీల్ కాపాడుకునేందుకు రెడీ

వైజాగ్ స్టీల్ కాపాడుకునేందుకు రెడీ

ఉత్తరాంధ్రలో తప్పెటగుళ్ల కళాకారులతో తిరిగారా, ఉద్దానం మారుమూల ప్రాంతానికి వెళ్లారా, అరకులో పాడేరు డివిజన్ లో, నక్సల్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లారా అని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. మీరు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారా అని అడిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రైవేటు గనులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

వైజాగ్ కార్మిక సంఘాల నాయకులారా చిత్తశుద్ధితో ఉన్నారా, నిలబడతారా.. ప్రైవేటీకరణ కాకుండా చూసుకుందామన్నారు. వారు కూడా బయటికి రావాలన్నారు. మీకోసం జైలుకెళ్లేందుకు సిద్ధమన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం పనిచేయడం లేదని, మీ గుండెల్లో ఇచ్చిన పదవే ముఖ్యమన్నారు. ముఖ్యమంత్రి పదవి వస్తే మంచిదని, అభివృద్ధితో మీ తాటతీస్తానని వైసీపీ నేతల్ని హెచ్చరించారు.

 ముస్లింల మద్దతు కోరిన పవన్

ముస్లింల మద్దతు కోరిన పవన్

తాను ఇస్లాంను గౌరవించే హిందువునని పవన్ తెలిపారు. ఓ ముస్లిం ఉగ్రవాది బాంబుపేలిస్తే అందరు ముస్లింలను ఎందుకు తప్పుపట్టాలని పవన్ ప్రశ్నించారు. తన జానీ సినిమాలో నారాజూ కాకురా మా అన్నయ్యా నజీరు అన్నయ్యా అనే పాటను ప్రస్తావించారు. ముస్లిం సమాజానికి తన మాటగా తీసుకెళ్లాలని ఓ విషయం చెప్పారు.

ఇస్లాంను తాను మనస్ఫూర్తిగా ఎంతో గౌరవిస్తానని తెలిపారు. కేంద్రంలో ఎవరున్నా అంతా సమర్ధించాల్సిందేనని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతదానికి వైసీపీని నమ్మే కంటే జనసేనను నమ్మాలని పవన్ కోరారు.

బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు..నా రూట్లో వెళ్తున్నా..

బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు..నా రూట్లో వెళ్తున్నా..

బీజేపీకి సంబంధించినంత వరకూ పొత్తు కుదిరినా బలంగా పనిచేయలేకపోయామని, అది బీజేపీ నేతలకు కూడా తెలుసని పవన్ తెలిపారు. తాను కలిసి వెళ్దామని అనుకుంటే రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారని బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలం గడిచిపోతుందన్నారు. పవన్ పదవి కోసం ఇంత ఆరాటపడడన్నారు. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే గూండాలు గదమాయిస్తుంటే నా ప్రజల్ని రక్షించుకోవడానికి తాను వ్యూహాలు మార్చుకోక తప్పడం లేదన్నారు. అంతమాత్రాన ప్రధానికీ, బీజేపీకి తాను వ్యతిరేకం కాదన్నారు. ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు ముందుకు తీసుకెళ్తామనేది కాదు అంతమాత్రాన ఊడిగం చేయబోమన్నారు.

English summary
pawan kalyan on today made serious warning to ysrcp leaders on package star comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X