Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీక్రెట్ మీటింగ్ జరిగిందా? శివాజీని పవన్ చేరదీస్తున్నారా!?

హైదరాబాద్ : ఏపీలో రాజకీయాలన్ని ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్నాయి. హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలు వెలువడుతున్నా.. ప్యాకేజీకి సంబంధించి పూర్తి స్పష్టత లేదు. మరోవైపు ప్యాకేజీలతో ఒరిగేదేమి లేదంటూ.. అటు ప్రతిపక్షం సహా ప్రజల్లోను అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సినీ నటుడు శివాజీ..హోదా విషయంలో టీడీపీ ఎంపీల తీరును తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'తొత్తుల్లా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ..' ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా కౌంటర్ ఎటాక్ చేశారు.

పవన్ సమర్థిస్తున్నందేకేనా..!

పవన్ సమర్థిస్తున్నందేకేనా..!

ఇదిలా ఉంటే.. హోదా విషయంలో ముందు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగానే నిలదీస్తోన్న శివాజీ.. పవన్ కళ్యాణ్ ను సమర్థిస్తూ గతం చాలా సార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'హోదా కోసం పవన్ గనుక సీరియస్ గా ఉద్యమిస్తే..! మూడు నెలల్లో హోదా ఖాయమంటూ' పలుమార్లు శివాజీ కామెంట్ చేశారు. దీనికి బలం చేకూరుస్తూ.. పవన్ తిరుపతిలో నిర్వహించిన మొన్నటి సభ ద్వారా కేంద్రంలో కదలిక మొదలయింది.

రహస్య భేటీ!!

రహస్య భేటీ!!

అనూహ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ప్రస్తుతం క్రియాశీలకంగా మారిన పవన్ కళ్యాణ్.. హోదా విషయంలో తనకు మద్దతునిచ్చే వారిని ఇప్పుడు తన వెంట ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ శివాజీ మధ్య ఓ రహస్య భేటీ కూడా జరిగిందన్న చర్చ జరుగుతోంది.

పవన్ ప్లానింగ్ లో భాగమేనా!

పవన్ ప్లానింగ్ లో భాగమేనా!

శివాజీనే వెళ్లి కలిశారో.. లేక పవన్ స్వయంగా ఆహ్వానించారో తెలియదు గానీ ఈ ఇద్దరి మధ్య ఓ భేటీ అయితే జరిగిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హోదాను పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో.. కాకినాడ సభలో పవన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే రాజకీయ పరంగాను బలంగా అడుగు వేయడానికే శివాజీ లాంటి వాళ్లను సైతం పవన్ చేరదీస్తున్నారనే గుసగుసలు తెరమీదకు వస్తున్నాయి.

పవన్ రంగంలోకి దిగడం వల్లే

పవన్ రంగంలోకి దిగడం వల్లే

పవన్ తిరుపతి సభ తర్వాత మాట్లాడిన శివాజీ.. పవన్ రంగంలోకి దిగారు కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ సభతో కేంద్రం వద్ద మంచి మార్కులు పడ్డట్టేనని, అయితే రాజకీయ నేతలంతా పవన్ విమర్శించే పని పెట్టుకోవద్దని పవన్ పై వచ్చిన విమర్శలను శివాజీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

పవన్ వస్తే.. బిచాణా ఎత్తేయాల్సిందేనన్న భయంతో!

పవన్ వస్తే.. బిచాణా ఎత్తేయాల్సిందేనన్న భయంతో!

పవన్ రాజకీయాల్లోకి వస్తే తాము బిచాణా ఎత్తేయాలన్న సంగతి చాలా మందికి తెలుసని, అందుకే ఆయనను విమర్శించేందుకు పలువురు అత్యుత్సాహం చూపిస్తున్నారని శవాజీ గతంలో వ్యాఖ్యలు చేశారు.

ఆ సత్తా పవన్ ఒక్కడిలోనే

ఆ సత్తా పవన్ ఒక్కడిలోనే

పవన్ ను విమర్శించే నేతలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని చెప్పిన శివాజీ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడేనని గతంలో టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాడు శివాజీ.

అందుకే శివాజీని పవన్ చేరదీస్తున్నారా!

అందుకే శివాజీని పవన్ చేరదీస్తున్నారా!

హోదా విషయంలో పవన్ నాయకత్వమే ఏపీకి హోదా తీసుకురాగలదంటూ.. విమర్శలను సైతం ఎదుర్కొని పవన్ నాయకత్వాన్ని శివాజీ బలంగా వినిపించడంతో.. శివాజీ లాంటి వ్యక్తులు తన వెనుక ఉండడం అవసరమని పవన్ భావిస్తున్నారనే చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+