పవన్ కళ్యాణ్! రోడ్డు పైకి రా, పది రోజుల్లో వస్తుంది: నటుడు శివాజీ డిమాండ్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే సరిపోదని, ఆయన కూడా రోడ్డెక్కితే హోదా వస్తుందని నటుడు, ప్రత్యేక హోదా సాధనా సమితి ప్రతినిధి శివాజీ అన్నారు.
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే సరిపోదని, ఆయన కూడా రోడ్డెక్కితే హోదా వస్తుందని నటుడు, ప్రత్యేక హోదా సాధనా సమితి ప్రతినిధి శివాజీ అన్నారు.
Recommended Video


పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి రావాలి
పవన్ కళ్యాణ్ హోదా గురించి మాట్లాడటమే కాదని, హోదా సాధించేందుకు బయటకు రావాలని శివాజీ అన్నాడు. పవన్ బయటకు వస్తే ప్రత్యేక హోదా రావడం ఖాయమని చెప్పారు. గురువారం ప్రత్యేక హోదా సాధనా సమితి ఆద్వర్యంలో ఏయూలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు.

బీజేపీపై నిప్పులు
ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు కుదరదంటున్న బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు.

చంద్రబాబు పైనా
బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో టీడీపీ కూడా ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిందని శివాజీ గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రంతో లాలూచీ పడి హోదా అంశాన్ని పక్కనపెట్టారన్నారు.

హోదా కోసం పోరాడుతాం
ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం కాదని హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. హోదా కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications