పవన్‌కు షాక్: 'క్షమాపణలు చెప్పాలి', 'బాబు చరిత్రలో ఇంతకంటే సిగ్గుమాలిందిలేదు'
అమరావతి: గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చినందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ, తీసుకు వస్తామని చెప్పి టిడిపి మాట తప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్రం ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపిస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫార్సులు మాత్రమే చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న వారు ప్యాకేజీ కావాలని ముందుగానే ఎందుకు డిమాండ్ చేయలేదో చెప్పాలని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.

ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఏముంటుంది: బాబుపై పార్థసారథి
ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించారంటే అంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఈ రాష్ట్రంలో ఏం ఉంటుందని వైసిపి నేత, మాజీ మంత్రి పార్థసారథి సోమవారం నాడు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఆయన సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు రాత్రి 12 గంటలకు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి, ప్యాకేజీని ఆహ్వానించారన్నారు. అంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం చంద్రబాబు చరిత్రలో ఉండదన్నారు.
ప్యాకేజీని ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ప్యాకేజీలో ఏం ఇచ్చారో స్పష్టంగా ఉందా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, లోటు బడ్జెట్.. ఇలా వీటికి ఇచ్చామని చెబుతున్నాని, ఇవన్నీ చట్టంలో లేవా అని ప్రశ్నించారు. వాటిని కొత్తగా ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications