హోదా టు వారసత్వం.. నాయకుడంటే, చెప్పీ చెప్పీ: పవన్ కౌంటర్ ఇలా
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన చేనేత దీక్షలో ప్రత్యేక హోదా, వారసత్వ రాజకీయాల పైన మాట్లాడారు. తద్వారా బీజేపీకి, తెలుగుదేశం, వైసిపిలకు కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన చేనేత దీక్షలో ప్రత్యేక హోదా, వారసత్వ రాజకీయాల పైన మాట్లాడారు. తద్వారా బీజేపీకి, తెలుగుదేశం, వైసిపిలకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మా పార్టీ రాష్ట్రాన్ని కాపాడుతుందని చెబుతారని ఆ తర్వాత మాత్రం మరిచిపోతారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన స్థితికి వచ్చేసరికి మాట తప్పడం ఏమిటని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్యాకేజీ అంటున్నారని, ఆ తర్వాత ప్యాకేజీకి చట్టబద్దత అని చెప్పి, అదీ అవసరం లేదని చెప్పడం ఏమిటన్నారు. ఇన్ని అబద్దాలు ఎందుకన్నారు. అబద్దాలు చెప్పీ చెప్పీ ప్రజలను మోసం చేయవద్దన్నారు.

రాజకీయాలు మురికిపట్టినా..
తనకు రాజకీయాలు అంటే గౌరవం అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాలు అనే మురికిలోకి ఎందుకు వెళ్తున్నారని తనకు చాలామంది చెప్పారన్నారు. చివరకు రాజకీయ నాయకులు కూడా తనకు ఆ మాట చెప్పారన్నారు.

డబ్బులు తినను
అయితే తనకు దోపిడీ చేయాల్సిన అవసరం, డబ్బులు తినే అవసరం లేదన్నారు. ప్రజల ధనాన్ని సంరక్షించే వారే రాజకీయ నాయకులు కానీ, ప్రజా ధనాన్ని పోగు చేసేవారు, వృథా చేసే వారు నాయకులు కాదన్నారు. తనకు ఒక్కరు ఓటు వేసినా తాను ప్రజల పక్షాన్నే ఉంటానని చెప్పారు.

అధికార పార్టీలకు కౌంటర్ ఇలా..
పవన్ కళ్యాణ్ అధికార పార్టీలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ తర్వాత మాట మార్చిందని పునరుద్ఘాటించారు. అలాగే, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ రుద్దవద్దని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలు ఆయన నారా లోకేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించి ఉంటారు. అయితే, జగన్‌కు కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇక, పవన్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంపై, ఆయనను చేనేత సోదరులు కలవడంపై అధికార పార్టీ విమర్శలు చేసింది. దీనిపైనా ఘాటుగా స్పందించారు.

వృత్తిని కించపరచవద్దు
తాను పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే కోట్లాది రూపాయలు వస్తాయని, కానీ తనకు ఆత్మసంతృప్తి ఉండదన్నారు. అందుకే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నానని చెప్పారు. తనను ఎంగిలాకులు ఎత్తుకునే వాడితో పోల్చినందుకు సంతోషమని, కానీ వృత్తిని కించపరచవద్దని కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications