వైసీపీకి భయం ఏంటో నేర్పిస్తాను : కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం- మూడు పెళ్లిళ్లు : పవన్ కళ్యాన్..!!

జనసేన అధినేత పవన్ అధికార వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తాను ఇప్పటికే చేసిన ట్వీట్ గురించి మరో సారి ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను గ్రామ సింహాలు అంటూ పేర్కొన్నారు. గ్రామ సిహాలు అంటే ఏంటంటూ...డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు..ఊర కుక్కలు.

ఎక్కువగా వాగి పళ్లు రాల్చుకొనే కుక్కలు అని చెప్పుకొచ్చారు. తాను వివేకా హత్య...కోడి కత్తి కేసు గురించి మాట్లాడితే నా మూడు పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారంటూ ప్రశ్నించారు. వైసీపీ కి భయం అంటే ఏంటో తెలియదని..అది తెలిసేలా చేస్తానని హెచ్చరించారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.

మూడు పెళ్లిళ్ల గురించి వారికి ఎందుకు

మూడు పెళ్లిళ్ల గురించి వారికి ఎందుకు

తన మూడు పెళ్లిళ్ల గురించి వాళ్లకెందుకని ప్రశ్నించారు. వైసీపీలో అధినేత మొదలు ఏ మహిళ గురించి తప్పుగా మాట్లాడమంటూ మాట ఇచ్చారు. జన సైనికులు సింహ గర్జన చేస్తారని చెప్పారు. ఈ సన్నాసులకు జన్మ ఇచ్చిన తల్లి దండ్రులే నేర్పలేని సంస్కారాన్ని నేనే నేర్పగలనా అంటూ నిలదీసారు. బూతులు రాక కాదని.. నా హక్కులకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరకోనంటూ స్పష్టం చేసారు. యుద్దం ఎలా కావాలి.. ప్రజాస్వామ్యంగా అయినా సిద్దం.. మరో రకంగా కావాలంటే దానికి సంసిద్దమని స్పష్టం చేసారు. మా నాన్నా ముఖ్యమంత్రి కాదని..ఇడుపుల పాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదని..వేల కోట్లు ఇవ్వలేదని చెబుతూ.. తన తండ్రి తనకు ఇచ్చింది ధైర్యం..తెగింపు,.,ధర్మ రక్షణ అని చెప్పుకొచ్చారు.

ఏ ఒక్కరినీ వదిలి పెట్టను..తిడితే బల పడతా..

ఏ ఒక్కరినీ వదిలి పెట్టను..తిడితే బల పడతా..

రాజకీయ కలుపు మొక్కలను తీసేసి మంచి చేయాలి. ప్రెసిడెంట్ మెడల్ కోసం చాలా కష్టపడాలి. కేంద్రం అప్పుడు ప్రెసిడెంట్ మెడల్ అప్పుడు ఇస్తుంది. రూ 500 ఇస్తే ఏపీ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుందని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో డెవలప్ మెంట్ ఎక్కడ ఉంది. రోడ్లు వేయరు. ఒక రాజకీయ పార్టీగా హక్కుగా అడుగుతామని స్పష్టం చేసారు. ప్రతీ సన్నాసి చేత తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. తాను యోగ మార్గం నుంచి వచ్చిన వాడినని..తనను తిట్టేస్తే కూర్చొని ఏడ్చేస్తానని అనుకుంటున్నారు. తిట్టే కొద్దీ బలపడతాను కానీ, బలహీన పడనని స్పష్టం చేసారు. మీరు లాగితే వెనక్కు వెళ్లను. ఏ ఒక్కరినీ మరిచి పోను. ఎలా కొట్టాలో కూడా నాకు తెలుసు. నేను యుద్దం ప్రకటించిన తరువాత వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేసారు.

తోలు తీసి కూర్చోబెడతా... భయపడేదిలేదు

తోలు తీసి కూర్చోబెడతా... భయపడేదిలేదు

ఇప్పుడు వైసీపీ..గతంలో టీడీపీ ప్రభుత్వాలు వాళ్ల పేర్లు పెట్టుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ల సొంత డబ్బుతో చేస్తున్నారా . కిరాయి మూకలు..బాంబులతో దాడులు చేస్తామంటే..కోడి కత్తి గ్యాంగులతో భయ పెడితే భయపడేది లేదు. నేను మర్యాద ఎలా ఉంటుందో చూపిస్తాను. పవన్ కళ్యాణ్ భయపడడు. సినిమా టిక్కెట్లతో నాకు ఏం నష్టం. నాకు థియేటర్లు ఉన్నాయా. సన్నాసుల్లారా..ఎవరికి ధియేటర్లు ఉన్నాయో నీకు తెలియదా. మీ వైసీపీ వాళ్లకే ఎక్కువ ఉన్నాయి. టిక్కెట్ ధరలు ఏదైనా పెట్టుకోండి. అక్కడ అమ్మాయి..అక్కడ అబ్బాయికి తీసుకుంది నెలకు 5 వేలు. జానీ సినిమా పోతే డబ్బులు వెనక్కు ఇచ్చేసానని చెప్పుకొచ్చారు. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవటానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు.

Recommended Video

    Tollywood Producers Meets AP minister Perni Nani
    జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

    జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

    భారతి సిమెంట్స్ ను ఊచితంగా పంచవచ్చు కదా. మీరు ప్రకటించిన రూ 700 కోట్లు తక్కువ కాదుగా. ఇళ్లల్లోకి వచ్చి బంగారం లాక్కెళ్లండి. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి. మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటరంటూ ప్రశ్నించారు. మీరు పీనాసులు..మీరు మాట్లాడుతారా నా గురించి అని నిలదీసారు. పచ్చి బూతులు తిడితే మేము చేతులు కట్టుకోవాలా అంటూ అడిగారు. పాత ఫ్యూడలెస్టిక్ రోజులు కావు. ఇడుపుల పాయ ఎస్టేట్ లో లేరు. మీ లాంటి వాళ్లకు లొంగేది లేదు..తాట తీస్తామంటూ హెచ్చరించారు. రోడ్లు వేయకుండా ఏం పీకుతున్నారంటూ ప్రశ్నించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మేము నిర్మాణాత్మకంగా వ్యవహ రిస్తామని ఆ రోజే చెప్పానని గుర్తు చేసారు. వాళ్ల కింత ఎంత కిరాయి సైన్యం ఉన్నా లెక్క చేయమని స్పష్టం చేసారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+