Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్! ఫైటర్ జగన్‌కు మద్దతివ్వు, నీవే సాక్షివి, బాబు చీటర్: రోజా

గుంటూరు: ప్రత్యేక హోదా కోసం ఏపీలో ప్రతి గుండె తపిస్తోందని, ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను ఎందుకు నిలదీయడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదివారం ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా అంటూ నాడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన పవన్ కళ్యాణ్ నేడు నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. జగన్ దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా తిరుపతిలో జరిగిన ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ, చంద్రబాబు హామీలిచ్చారన్నారు.

అందుకు పవన్ కళ్యాణే సాక్షి అన్నారు. మంత్రి నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలు, పట్టిసీమలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్లు కొల్లగొట్టడం వంటి దారుణాలు.. పవన్ కళ్యాణ్‌కు కనపడటం లేదా అన్నారు. ప్రశ్నించేందుకే వచ్చానని చెప్పిన పవన్ వీటిపై మాట్లాడటం లేదేం అన్నారు.

Pawan Kalyan! support YS Jagan's deeksha: Roja

జగన్ దీక్షకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికి, హోదా కోసం పోరాడాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ ఫైటర్ అయితే చంద్రబాబు చీటర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీతో కలిసి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మీరేనంటూ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ.. తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. కరువుకు బ్రాండ్ అంబాసిడర్‌గా, రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన వ్యక్తిగా చంద్రబాబును భవిష్యత్తు గుర్తు పెట్టుకుంటుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+