గన్ మెన్ లపై పవన్ కళ్యాణ్ కు అనుమానమా?...పోలీసుల విస్మయం

అమరావతి: పవన్ కళ్యాణ్ భద్రత కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు గన్ మెన్ ను నియమిస్తే వారిపైనే జనసేనాని అనుమానం వ్యక్తం చేశారన్న ప్రచారంపై పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా తనంతట తానుగా ప్రభుత్వం గన్ మెన్ ను ఏర్పాటు చేయలేదని, పవన్ కోరిక మీదటే భద్రతా సిబ్బందిని కేటాయించడం జరిగిందని పోలీసు వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

వాస్తవంగా నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించేది ఇంటలిజెన్స్ వర్గాలని, ఏఆర్ పోలీసులు ఆ పని చేయరని పోలీసు వర్గాలు వివరిస్తున్నాయి. అయినా పవన్ కు నిజంగానే అలాంటి అనుమానాలుంటే ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులందరిలో పవన్ తనకు నమ్మకమున్న వారిని సెలెక్ట్ చేసుకుంటే వారినే గన్ మెన్లుగా పంపడానికి తాము ప్రయత్నం చేస్తామంటున్నారు.

Pawan Kalyan suspected on gun men?...Police associations awe

తనకు భద్రత కల్పించాలని పవన్‌ స్వయంగా కోరిన మీదట ప్రభుత్వం స్పందించి 2+2 భద్రత కల్పించిందని, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నేతలకు గన్‌మెన్లతో రక్షణ కల్పిస్తుంటాయని అన్నారు. ఆ గన్ మెన్ కు వారిని కేటాయించిన వారికి భద్రత కల్పించడం తప్ప మరో పని అప్పగించరని, అలాంటిది గన్‌మెన్‌తో తనపై నిఘా వేయించారని పవన్‌ అనుమానించారనే వార్తలు విస్మయం కలిగించాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

అయితే ప్రస్తుత పరిస్థితులని బట్టి పవన్ కళ్యాణ్ కు రక్షణ చాలా అవసరమని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గన్‌మెన్‌ను తిప్పి పంపడం సరికాదని, ఈ విషయమై పవన్ పునరాలోచించుకోవాలని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+