బాబూ! ఏం మాటలవి, 'జానీ' కోసం నేను చేశా, అలా చేయండి: పవన్ కళ్యాణ్

Recommended Video

    టీడీపీకి మద్దతిస్తే మంచివాడిని లేదంటే బీజేపీవాడిని మరి మీరు ఎవరి వారు : పవన్

    విజయనగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర శుక్రవారం విజయనగరం జిల్లాలో కొనసాగింది. తన ఉత్తరాంధ్ర పర్యటనలో అధికార టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే, అన్ని పార్టీల ఉత్తరాంధ్ర నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు.

    గజపతినగరంలో పవన్ కళ్యాణ్ పోరాటయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసమే జనాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. విభజన నేపథ్యంలో నష్టపోయిన ఏపీకి నష్టం కాకూడదని టీడీపీ - బీజేపీలకు నాడు మద్దతిచ్చానని చెప్పారు.

     టీడీపీకి మద్దతిస్తే మంచివాడిని లేదంటే బీజేపీవాడిని

    టీడీపీకి మద్దతిస్తే మంచివాడిని లేదంటే బీజేపీవాడిని

    అనుభవజ్ఞుడు అనే ఆలోచనతో చంద్రబాబును సమర్థించానని పవన్ చెప్పారు. ఓటు చీలితే నష్టం జరుగుతుందని భావించానని, అందుకే 2014లో పోటీ చేయలేదని చెప్పారు. నేను టీడీపీకి మద్దతిస్తేనేమో మంచివాడని ఆ పార్టీ నేతలు అంటున్నారని, సమస్యలపై, తప్పులను నిలదీస్తే మాత్రం బీజేపీ మనిషి అని ముద్రవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరి పక్షం కాదని, తాను ప్రజల పక్షమని ఆయన మరోసారి చెప్పారు.

    హోదాపై మొదట నిలదీసింది జనసేన

    హోదాపై మొదట నిలదీసింది జనసేన

    టీడీపీ నేత అశోక్ గజపతి రాజు గతంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని చెప్పారని, గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసినప్పుడు తాను తెలుసునని, ఇప్పుడు మాత్రం నేను ఎవరో తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎన్నోసార్లు యూటర్న్‌లు తీసుకుందన్నారు. హోదాపై మొదట బీజేపీని నిలదీసిందే జనసేన అన్నారు.

    ఇదేం మాట, ఏపీ అభివృద్ధి చెందింది అంటావ్, నిధులు లేక అభివృద్ధి లేదంటావ్

    ఇదేం మాట, ఏపీ అభివృద్ధి చెందింది అంటావ్, నిధులు లేక అభివృద్ధి లేదంటావ్

    నేను బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నానని చంద్రబాబు, టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదం అని పవన్ అన్నారు. చంద్రబాబు ముందే మేల్కొంటే హోదా వచ్చేదన్నారు. హోదా వస్తే జూట్ మిల్లులు మూతపడకుండా ఉండేవన్నారు. చంద్రబాబు భిన్నరకాలుగా మాట్లాడుతారని పవన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం అభివృద్ధి చెందిందని అంటారని, కేంద్రం సహాయం చేయకున్నా ముందుకు వెళ్తున్నామని చెబుతారని, మళ్లీ ఏపీకి వచ్చి కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోయిందని చెబుతారని ఎద్దేవా చేశారు.

    ఆ రోడ్లు కేంద్రం వేసింది

    ఆ రోడ్లు కేంద్రం వేసింది

    చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు మాట్లాడుతూ.. మేం వేసిన రోడ్లపై ప్రతిపక్షాలు నడుస్తున్నాయని చెబుతారని, కానీ అవి ప్రజల సొమ్ముతో వేసినవని గుర్తుంచుకోవాలన్నారు. ఆ రోడ్లు వేసింది కూడా కేంద్రం అన్నారు. తాను ఎవరో అశోక్ గజపతి రాజుకు తెలియకపోవచ్చునని, కానీ అణగారిన ప్రజలకు మాత్రం తాను తెలుసునని చెప్పారు.

    జానీ సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్

    జానీ సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో జానీ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయి, నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. పవన్ తన రెమ్యునరేషన్ వదులుకొని సహృదయత చాటుకున్నారు. దీనిని ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. జానీ సినిమా ప్లాప్ అయిందని, తనకు ఇవ్వాల్సిన రూ.2 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఇంటికి వచ్చారని, సినిమా పోవడంతో ఆ డబ్బు తీసుకోవడానికి తనకు మనసు అంగీకరించలేదన్నారు. ఓ వైపు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినప్పుడు అది తీసుకోవడం బాధగా అనిపించిందన్నారు. అందుకే ఆ డబ్బులు తిప్పి పంపించానన్నారు.

    నేను జానీ కోసం చేసినట్లు చేయాలి

    నేను జానీ కోసం చేసినట్లు చేయాలి

    ఆ డబ్బు సినిమాలో నటించడం ద్వారా నేను సంపాదించినది అని పవన్ గుర్తు చేశారు. దానిని తాను తీసుకుంటే అడిగేవారు లేరన్నారు. కానీ బాధ్యత గలవాడిగా తాను దానిని వెనక్కి పంపించానని చెప్పారు. అది మన కుటుంబమని, మనలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టారని, వారికి అండగా నిలబడాలని అలా చేశానన్నారు. అలాగే చంద్రబాబు కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ ప్రజలకు అండగా ఉండాలన్నారు. ప్రజలను దోచే ప్రభుత్వాలు మనకు వద్దన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+