చంద్రబాబు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు- జగన్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలు పెట్టింది. 2029 ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దం చేసింది. మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వం పైనా పోరాటానికి సిద్దమయ్యారు. పలు అంశాల పైన ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. తాజా పరిణామాల పైన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా జగన్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్ పైన రాజకీయంగా చర్చ కొనసాగుతోంది.
మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన మరోసారి విమర్శలు చేసారు. వరుసగా పలు అంశాల పైన జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా చేసిన ట్వీట్ లో.. " గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారని" విమర్శించారు.

వారికి అండగా నిలుస్తాం
దీనికి కొనసాగింపుగా.."గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.." అని జగన్ పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications