సీఎం విజయ్ తనయుడి డెబ్యూ ట్రెజర్ హంట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ అవుట్.. !!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అతను మెగా ఫోన్ పట్టిన తొలి చిత్రం సిగ్మా. ఈ ఫిల్మ్ విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటించాడిందులో. అతని సరసన ఫారియా అబ్దుల్లా కథానాయిక పాత్రను పోషించింది. కోరియోగ్రాఫర్ రాజు సుందరం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్యాథరిన్ థ్రెసా స్పెషల్ సాంగ్ లో అలరించనుంది.
అక్టోబర్ 2వ తేదీన ఈ ఫిల్మ్ విడుదల కాబోతోంది. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా రూపొందిన సిగ్మా చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ లల్లో ఒకటైన లైకా నిర్మించింది. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్, సంజీవ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ట్యూనీ జాన్ పబ్లిసిటీ డిజైన్, హరిహరసూదన్ వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలను పర్యవేక్షించారు.

జేసన్ సంజయ్ కు డెబ్యూ మూవీ కావడం, టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోతోండటం, అదే స్థాయిలో టెక్నీషియన్స్ పని చేస్తోండటంతో సిగ్మా మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సిగ్మా' చిత్రం ఓ నూతన కథాంశంతో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ప్రేక్షకులను పలకరించనుంది. ట్రెజర్ హంట్ కథతో పాటు ఉత్కంఠభరితమైన హీస్ట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇటీవల విడుదల చేసిన సందీప్ కిషన్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. చెన్నై, సేలం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అనంతరం దట్టమైన తలకోన అడవులు, అలాగే థాయిలాండ్‌లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకొంది. ట్రెజర్ హంట్ మూవీ కావడం వల్ల మినిమ్ గ్యారంటీ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
జేసన్ సంజయ్ దర్శకత్వంపై విదేశీ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందాడు. ఆ తర్వాతే మెగా ఫోన్ పట్టాడు. 2020లో టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తి చేసిన అతను, లండన్‌లో స్క్రీన్‌రైటింగ్‌లో బీఏ డిగ్రీని కూడా పొందాడు. గతంలో పలువురు నిర్మాతలు జేసన్‌ను హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నించారు గానీ సాధ్యపడలేదు.
ప్రేమమ్, సర్వం మాయా, వాళా 2 వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మలయాళ టాప్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్ కూడా జేసన్ కు కథ వినిపించారు గానీ అతనికి దర్శకత్వంపై ఉండే ఇష్టంతో అటు వెళ్లలేదు. నిజానికి జూలైలో సిగ్మా సినిమా విడుదల కావాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నారు మేకర్స్. విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు పోటీ ఉండకూడదనే కారణంతో అప్పట్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేదు.
Mark the date for the heist on October 2. 💰 #SIGMA is all set to light up the screens. 🔥 @official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee @MagaAnan… pic.twitter.com/yD4N14DLeY
— Lyca Productions (@LycaProductions) August 18, 2026















Click it and Unblock the Notifications