ఆకాశంలో విమానాలకు రూట్లు, డివైడర్లు.. అసలు ఎలా తెలుస్తుంది?

సహజంగా భూమి మీద అయితే వాహనాలు ప్రయాణం చేయడానికి రోడ్లు, డివైడర్లు, లైన్లు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఆకాశంలో చూస్తే ఏమి కనిపించదు. అయినప్పటికీ నిత్యం వేలాది విమానాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అసలు ఆకాశంలో రూట్స్, లైన్స్ ఉంటాయా? విమానాలు ఒకదానికొకటి ఢీ కొట్టకుండా సురక్షితంగా ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతున్నాయి? ఇది ఎలా సాధ్యమవుతుంది? అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రతి విమానానికి నిర్దిష్ట రూట్, ఎత్తు, దిశ

విమానాలు ఎప్పుడు యాదృచ్ఛికంగా ఎగరలేవు. ప్రతి విమానానికి నిర్దిష్ట రూట్, ఎత్తు, దిశ ఉంటాయి. తూర్పువైపు వెళ్లే విమానాలు 0 నుండి 179 డిగ్రీల మధ్య ప్రయాణం చేస్తాయి. పడమర వైపు వెళ్లే విమానాలు 180 డిగ్రీల నుంచి 359 డిగ్రీల మధ్య ప్రయాణం చేస్తాయి. విమానాలకు ఎత్తు విషయంలో కూడా నియమాలు ఉంటాయి. తూర్పు దిశ విమానాలు బేసి సంఖ్యలో 31,000, 33,000, 35,000 అడుగులు ఎత్తులో ఎగురుతాయి.

Flights flying routes No roads or dividers in the sky yet planes fly safely Know how Air Traffic Control works

భూమి మీద నుండి కంప్యూటర్ స్క్రీన్ ల పైన విమానాల పర్యవేక్షణ

ఇక పడమర తీసుకు వెళ్లే విమానాలు సరి సంఖ్యల 32,000, 34,000, 36,000 అడుగులు ఎత్తులో ఎగురుతాయి. దీనివల్ల రెండు విమానాల మధ్య కనీసం వెయ్యి అడుగుల నిలువుదూరం ఉంటుంది. అడ్డం దూరం కనీసం మూడు నుండి ఐదు మైళ్ళు ఉండేలా ఏటీసీ పని చేస్తుంది. ఏటీసీ కంట్రోలర్లు భూమి మీద నుండి కంప్యూటర్ స్క్రీన్ ల పైన విమానాలను నిరంతరం పర్యవేక్షిస్తారు.

విమానంలోని పైలట్లకు కూడా స్క్రీన్‌పై రూట్ లైన్లు

జిపిఎస్, రేడియోతరంగాల ద్వారా ప్రతి విమానం ఎక్కడ ఉందో, ఎంత ఎత్తులో ఎగురుతుందో, ఏ దిశలో వెళ్లిందో స్పష్టంగా చూస్తారు. విమానంలోని పైలట్లకు కూడా స్క్రీన్‌పై రూట్ లైన్లు కనిపిస్తాయి. ఇవి ఆకాశంలోని 'రోడ్లు' లాంటివి. టేకాఫ్ అయిన తర్వాత చాలా సమయం ఆటోపైలట్ మోడ్‌లోనే విమానం ఈ లైన్లను అనుసరించి ప్రయాణిస్తుంది.

అమెరికాలో ఎదురెదురుగా ఒకే నంబర్‌తో రెండు విమానాలు

ఇటీవల అమెరికాలో జరిగిన ఘటన ఈ ఏటీసి వ్యవస్థ ఎంత ముఖ్యమో చూపించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు ఒకే ఫ్లైట్ నంబర్ అమెరికన్ 2482తో, ఒకే రూట్‌లో ఎదురెదురుగా వచ్చాయి. ఒకటి టేకాఫ్ అవుతూ, మరొకటి ల్యాండింగ్ కోసం వస్తూ ఉంది. సాధారణంగా ఒకే నంబర్‌తో రెండు విమానాలు ఉండకూడదు. కానీ ఆలస్యం కారణంగా ఇలా జరిగింది.

రెండు విమానాలు వేర్వేరు ఎత్తుల్లో ప్రయాణించటంతో తప్పిన ప్రమాదం

ఇప్పుడు ATC కంట్రోలర్ సూచనలు రెండు విమానాల పైలట్లకు ఒకేలా వినిపించే ప్రమాదం ఉంది. అయితే కంట్రోలర్ సమయస్ఫూర్తితో "టేకాఫ్ అవుతున్న అమెరికన్ 2482" మరియు "ల్యాండ్ అవుతున్న అమెరికన్ 2482" అని వేర్వేరుగా సూచనలు ఇచ్చారు. దీని వల్ల రెండు విమానాలు వేర్వేరు ఎత్తుల్లో ప్రయాణించటం కారణంగా ప్రమాదం తప్పింది.

రాయలసీమ ఉద్యాన హబ్.. రాష్ట్రవాటా రూ.10 వేల కోట్లు భరించేలా ఏపీకి కేంద్రం భారీ సాయం!
రాయలసీమ ఉద్యాన హబ్.. రాష్ట్రవాటా రూ.10 వేల కోట్లు భరించేలా ఏపీకి కేంద్రం భారీ సాయం!

ఆకాశంలో నో రూట్, అక్కడ కూడా కఠినమైన 'రూట్ వ్యవస్థ'

ఇలా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ, కఠినమైన ఎత్తు-దిశ నిబంధనలు, ఆధునిక టెక్నాలజీ కలిసి ఆకాశంలో వేలాది విమానాలు సురక్షితంగా ప్రయాణించేలా చూస్తున్నాయి. నేల మీద రోడ్లు కనిపించినట్లు ఆకాశంలో కనిపించకపోయినా, అక్కడ కూడా కఠినమైన 'రూట్ వ్యవస్థ' ఉందని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+