సామాన్యులకు బిగ్ షాక్.. లీటర్ పాలపై రూ.8 పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..

పొద్దున్నే లేవగానే ప్రతి ఇంట్లో టీ, కాఫీ తాగందే డే స్టార్ట్ కాదు. అందుకు పాలు అవసరం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ పాలు కచ్చితంగా రోజూవారీ వంటకాల్లో ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే పేద, మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. పాల ధరలు పెరగనున్నాయి. లీటర్ పాలపై రూ. 8 వరకు పెరగనుంది. పెరిగిన ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతులను ఆదుకునేందుకు ఈ పాల ధరలను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కర్ణాటక మంత్రి బైరే గౌడ వెల్లడించారు.

"రాష్ట్ర ప్రభుత్వం పాల ధరలపై చర్చించి ధరలను పెంచాలని నిర్ణయించింది. లీటర్ పాలపై రూ. 8 వరకు పెంచనుంది. పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి" అని స్పష్టం చేశారు. ఇక పాల ధరలను పెంచడానికి గల కారణాలను వివరిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని మరోవైపు చెరకు రైతులు గిట్టుబాటు ధర కోసం నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో అధికశాతం రైతులు పాడి పరిశ్రమ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

milkprices by Rs 8 per litre shock for the common man Karnataka government makes a key decision now

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అస్థిరత నెలకున్న తరుణంలో డెయిరీ రంగం ద్వారానే రైతులు రోజూవారీ ఖర్చులు తీరేలా.. ఇంటి నిర్మాణాలు.. పిల్లలను చదివించుకోవడం.. వైద్య ఖర్చులను చెల్లించడం చేస్తున్నారని తెలిపారు. ఇక పాల ధరలను సవరించాలంటూ గతంలోనే పాడి రైతులు నిరసనలు చేపట్టారు. లీటర్ ‎కు రూ.10 పెంచాలని డిమాండ్ చేస్తూరాగా.. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూ.8 పెంపునకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మరోవైపు పాల ధరల పెంపుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బియ్యం, పప్పుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు పాల ధరలు కూడా పెరగడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+