ప్రపంచాన్ని చుట్టేద్దామనుకుంటే.. నడి సముద్రంలో వదిలేశారు

ప్రపంచమంతా చుట్టేస్తూ, రోజూ ఒక కొత్త దేశంలో నిద్రలేవాలనేది చాలామందికి ఉండే ఒక పెద్ద కల. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ప్రపంచాన్ని తిరిగేద్దామనుకునే భాగ్యవంతుల కలలను ఆసరాగా చేసుకుని 'సముద్రంపై తేలియాడే నివాసాలు' పేరిట ఓ విదేశీ కంపెనీ భారీ హంగామా చేసింది. ఓ విలాసవంతమైన విహార నౌకనే శాశ్వత నివాసంగా మార్చుకుని, ఏళ్ల తరబడి సముద్ర ప్రయాణం చేయవచ్చంటూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే, ఆ నివాస నౌక ప్రయాణం సగం దూరం కూడా సాగకుండానే కంబోడియా తీరంలో ఆర్థిక సంక్షోభం రూపంలో భారీ ప్రమాదంలో పడింది. ఇంధన ధరల భారం, అంతర్గత నిర్వహణ లోపాలతో నౌక సర్వీసులను హఠాత్తుగా నిలిపివేయడంతో వందలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో కంబోడియా సముద్ర తీరంలో చిక్కుకుపోయారు.

లగ్జరీ క్యాబిన్.. కోట్లలో పెట్టుబడి!

అమెరికా ఫ్లోరిడాకు చెందిన 'విల్లా వీ రెసిడెన్సెస్' అనే సంస్థ ఈ వినూత్న సముద్ర నివాస ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. 'ఎమ్‌వీ ఆడీసీ' అనే భారీ క్రూయిజ్ షిప్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అందులో క్యాబిన్లను నివాస గృహాలుగా విక్రయించింది. ఒక్కో క్యాబిన్ జీవితకాల హక్కుల ధర అక్షరాలా రూ.2 కోట్ల పైమాటే. అంతేకాకుండా ప్రతినెలా మెయింటెనెన్స్ ఖర్చుల కింద వేలాది డాలర్లు వసూలు చేసేవారు. హోటళ్లు మారే తిప్పలు లేకుండా, తరచూ సూట్‌కేసులు సర్దుకోవాల్సిన అవసరం లేకుండా ప్రపంచం మొత్తాన్ని తమ గుమ్మం ముందుకు తీసుకొచ్చే ఈ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై అమెరికా సహా పలు దేశాలకు చెందిన ధనవంతులు, రిటైర్డ్ ఉద్యోగులు, డిజిటల్ నోమాడ్స్ ఈ నౌకలో శాశ్వత నివాసాలను కొనుగోలు చేశారు.

Villa Vie Residences Cruise Ship Stranded in Cambodia After Fuel Crisis Halts World Voyage Details Inside

ప్రపంచ యాత్రగా మొదలై.. అడుగడుగునా సమస్యలు!

ఉత్తర ఐర్లాండ్‌లో అన్ని రీఫిట్టింగ్ పనులూ పూర్తి చేసుకుని, 2024 అక్టోబర్‌లో ఈ విలాసవంతమైన 'ఎమ్‌వీ ఆడిసీ' నౌక మూడేళ్లన్నర ప్రపంచ యాత్రను ప్రారంభించింది. ఏడు ఖండాలను చుట్టిరావాలనే లక్ష్యంతో ప్రయాణం మొదలైన కొద్దిరోజులకే పర్యాటకులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అనుకున్న షెడ్యూళ్లను తరచూ మార్చడం, నౌకలో వైఫై సేవలు సరిగా లేకపోవడం, ఫుడ్ క్వాలిటి లేకపోవడం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఇంధనం, ఇతర ఖర్చుల పేరుతో యాజమాన్యం తమ వద్ద నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తోందని ప్రయాణికులు ఆరోపించడం ప్రారంభించారు.

All Time Record: నడి సంద్రంలో 12.7 మిలియన్ టన్నుల సరుకు మార్పిడి..
All Time Record: నడి సంద్రంలో 12.7 మిలియన్ టన్నుల సరుకు మార్పిడి..

భగ్గుమన్న ఇంధన మంట.. మధ్యలోనే ముగిసిన ప్రయాణం

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ నిబంధనల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఆసియా సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రతినెలా ఒక్కో క్యాబిన్‌పై ఇంధన భారం సుమారు రూ.1.5 లక్షల నుంచి ఏకంగా రూ.6.5 లక్షల వరకు పెరిగిపోయింది. నౌక వేగాన్ని తగ్గించి, రేవుల్లో ఎక్కువ సేపు ఉంచడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని చూసినా ఫలితం లేకపోయింది. దీంతో నౌకను నడపడం తమ వల్ల కాదంటూ అక్టోబర్ 27న కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసింది.

Cyclone Arnab: అంతర్వేదీ తీరంలో సల్ఫర్ నౌక కలకలం.. తుపాను ప్రభావంతో ఒడ్డుకు
Cyclone Arnab: అంతర్వేదీ తీరంలో సల్ఫర్ నౌక కలకలం.. తుపాను ప్రభావంతో ఒడ్డుకు

7 గంటల డెడ్‌లైన్.. రోడ్డున పడ్డ కోటీశ్వరులు!

కంబోడియాలోని సిహానోక్‌విల్లే పోర్టుకు నౌక చేరుకున్న కొద్దిసేపటికే కంపెనీ సంచలన ప్రకటన చేసింది. నౌకలోని 203 మంది ప్రయాణికులు, 156 మంది సిబ్బంది కేవలం 7 గంటల వ్యవధిలోనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. తమ సొంత నివాసాలను అమ్మేసి, సముద్రంపై ఇళ్లను కొనుగోలు చేసిన ఈ బాధితులు, ఇప్పుడు తిరిగి స్వదేశాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయాలు లేక, చేతిలో ఉన్న కోట్ల రూపాయల పెట్టుబడి ఏమవుతుందో తెలియక విలపిస్తున్నారు. కేవలం ఇంధన ధరల పెరుగే కాకుండా, యాజమాన్య లోపాలు, సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక అందమైన కలగా మొదలైన తేలియాడే నివాస ప్రయాణం.. చివరికి కంబోడియా తీరంలో ఒక కడివెడు కన్నీటిగా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+