Viral Video: నా పుస్తెలతాడునే లాగుతార్రా..? దొంగల్ని పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన మహిళ
సాధారణంగా దొంగలు యజమానుల నుంచి తప్పించుకుని పోలీసులకు దొరుకుతారు. కానీ ఈ దొంగలు మాత్రం దొంగతనం చేస్తూ యజమానికే దొరికారు. దాంతో వారికి దేహశుద్ధి తప్పలేదు. గత కొంత కాలంగా బంగారం రేట్లు పెరుగుతున్న క్రమంలో దోపిడీలు పెరుగుతున్నాయి. మహిళలు బయట కనిపిస్తే వారి మెడలో పుస్తెల తాడులు లాక్కెల్లడం, తాళం వేసిన ఇళ్లలో చొరబడి బంగారం, డబ్బును కాజేయడం లాంటి ఘటనలు ఇటీవల అధికం అవుతున్నాయి. ఓవైపు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. మహిళ మెడలో చైన్ స్నాచింగ్ కు యత్నించగా ఆ మహిళ సాహసంతో వారిని పట్టుకుని చితకబాదింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఏం జరిగిందంటే..?
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామానికి చెందిన కిష్టమ్మ అనే మహిళ తన పొలంలో పని చేస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఆమె మెడలోని పుస్తెల తాడును లాక్కునేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఆమె కేకలు వేయడంతోపాటు వారిని పట్టుకునేందుకు యత్నించింది. వారి చేతి వేళ్లు కొరికింది. ఈ లోపు సమీప పొలాల్లోని రైతులు వచ్చి వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ పెద్ద కర్రతో ఇద్దరు దొంగల్ని కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.
పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన దొంగల్ని పట్టుకుని పొట్టు పొట్టు కొట్టింది! సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచింగ్ యత్నం.. ఇద్దరు నిందితులు అరెస్ట్జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో పొలంలో పనిచేస్తున్న కిష్టమ్మ మెడలోని పుస్తెలతాడును లాక్కునేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఆమె కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.నిందితులు హత్నూర మండలం ముచ్చర్లకు చెందిన వడ్డే సాయిలు, మీనంపల్లికి చెందిన అరవింద్‌గా గుర్తించారు. వీరిపై గతంలోనూ కేసులు ఉన్నాయని జిన్నారం సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
— TNews Telugu (@TNewsTelugu) October 29, 2026
ఈ ఘటనలో దొంగల నుంచి నగలను కాపాడుకున్న ఆ మహిళ ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక నిందితులు హత్నూర మండలం ముచ్చర్లకు చెందిన వడ్డే సాయిలు, మీనంపల్లికి చెందిన అరవింద్ గా గుర్తించారు. వీరిపై గతంలోనూ కేసులు ఉన్నాయని జిన్నారం సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరిపైనా అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
