Aadarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో ప్లస్ లు, మైనస్‌ లు ఇవే..!

విక్టరీ వెంకటేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అనగానే మనకు ఓ నువ్వు నాకు నచ్చావ్, ఓ మల్లీశ్వరి సినిమాలే గుర్తుకొస్తాయి. ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం: హౌజ్‌ నెంబర్‌ 47' ఈ మూవీలో వెంకటేశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించారు. అలాగే సత్య, నివేతా పేతురాజ్‌, నారా రోహిత్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆదర్శ కుటుంబం మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదొక సింపుల్ ఫ్యామిలీ డ్రామా కాదని.. ఇందులో క్రైమ్, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం అవుతోంది. అలాగే త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు, వెంకటేశ్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉందని తెలుస్తోంది.

ఇక ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 23 నిమిషాలుగా ఉంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో 16 ఏళ్ల పైబడిన వాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. ఇక ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 30 న గ్రాండ్ గా విడుదలకు సిద్ధం అయింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రీమియర్స్ కు సంబంధించిన రివ్యూ బయటకు వచ్చింది. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఆదర్శ కుటుంబం మూవీ ట్విట్టర్ టాక్ చూస్తే సినిమాలో కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమెడియన్ సత్య క్యారెక్టర్ బాగా నవ్విస్తుందని సమాచారం.

అలాగే ఈ మూవీ కోసం దర్శకుడు త్రివిక్రమ్ తీసుకున్న కోర్ ప్లాట్ ఆసక్తికరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, సీన్స్ బాగా వచ్చినట్లు సమాచారం. ఇక సెకండాఫ్ లో మూవీలో యాక్షన్ సీన్స్ ను ఆసక్తికరంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ లో ఫ్యామిలీ మ్యాన్ గా, ఇన్నోసెంట్‌ గా ఉండే చిట్టిబాబు సెకండాఫ్ లో తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వైలెంట్‌ గా మారే విధానం ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.

AdarshaKutumbam The Twitter review for Adarsha Kutumbam is out here are the pluses and minuses

అలాగే మూవీలో చిట్టిబాబు ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే క్లైమాక్స్ కూడా బాగున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నెగటివ్ ల విషయానికి వస్తే థమన్ మ్యూజిక్ అంతగా లేదని సమాచారం. అయితే స్టోరీ కొత్తగా ఏమీ లేదని వెంకటేశ్ గత చిత్రాల మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మూవీ నచ్చే అవకాశం ఉందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆదర్శ కుటుంబం ఫుల్ రివ్యూ కోసం మరికొద్ది గంటలు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+