ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ లు.. నువ్ మామూలోడివి కాదన్నా..!

సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ కావడానికి ఎంత లేదన్నా సంవత్సరం పడుతుంది. భారీ బడ్జెట్.. భారీ క్యాస్ట్ ఉంటే ఇంకా ఎక్కువే పడుతుంది. అయితే ఓ స్టార్ హీరో మాత్రం అందుకు భిన్నం. ఈ ఏడాది ఆయన ఏకంగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చారు. మూడు సినిమాలు బ్లాక్ బస్టరే.. ఆయన ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఓవైపు ఏడాదికి ఒక్క సినిమాను తీసుకురావడానికే హీరోలు నానా తంటాలు పడుతుంటే సూర్య మాత్రం గ్యాప్ లేకుండా కుమ్మేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేశారు. గతేడాది వరకు వరుస ప్లాఫ్ లతో సూర్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టి ఆకలి తీర్చారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంగువ మూవీ అలాగే ఆ తర్వాత వచ్చిన రెట్రో మూవీ రెండూ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే కాస్త గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మే 14 న కరుప్పు అనే సినిమాతో వచ్చారు సూర్య. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సూర్యకు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కరుప్పు చిత్రానికి ఆర్. జే. బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సూర్య సరసన త్రిష నటించింది. తెలుగులోనూ వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ అయి హిట్ కొట్టింది ఈ మూవీ. ఈ సినిమా సక్సెస్ తో సూర్య ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.

ఆ తర్వాత ఆగస్టు 14 న విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీతో అలరించారు సూర్య. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ మూవీలో సూర్య తో పాటు మలయాళం సెన్సేషన్ మమితా బైజు, రాధిక శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ మూవీ తమిళం, తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీకి రూ. 270 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ మాధ్యమంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Suriya kollywood star hero scene movie gets super hit talk three blockbusters in a single year

ఇక ఈ రెండు సినిమాల తర్వాత సూర్య ప్రస్తుతం 'సీన్' మూవీతో రాబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రస్తుతం పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో సూర్య సరసన నజియా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ యంగ్ హీరో నెస్లన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీన్ మూవీలో 13 పాటలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సూర్య ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+