నవపంచమ రాజయోగంతో 5 రాశులకు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి మధ్య ఏర్పడే సంబంధాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలోనే రాక్షస గురువైన శుక్రుడు, న్యాయాధికారి అయిన శనిదేవుని మధ్య అత్యంత శక్తివంతమైన 'నవపంచమ రాజయోగం' ఏర్పడబోతోంది. జ్యోతిష్య పండితుల అంచనా ప్రకారం, ఈ అరుదైన యోగం వల్ల కొద్దిరోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టడమే కాకుండా, అష్టైశ్వర్యాలు వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ భాగ్యకరమైన రాశుల వివరాలు తెలుసుకుందాం.

మీన రాశి

మీన రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు అకస్మాత్తుగా సహాయం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహరాశి, కన్యా రాశి సెప్టెంబరు నెల జాతకఫలం
సింహరాశి, కన్యా రాశి సెప్టెంబరు నెల జాతకఫలం
Horoscope With the Nava-Panchama Raja Yoga everything turns to gold for 5 zodiac signs

తులా రాశి

కళలు, వినోదం, డిజైనింగ్, ఫ్యాషన్, మీడియా రంగాలలో పనిచేసే తులా రాశి వారికి ఈ యోగం లక్ష్మీదేవి కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆఫీసులో పెద్దల, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం, మద్దతు లభించి వృత్తిలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.

కుంభ రాశి

ఈ యోగ ప్రభావంతో కుంభ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, వైవాహిక జీవితంలో కొత్త అనుబంధం నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరపడటంతో పాటు ఇల్లు, భూమి లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

మిథున రాశి, కర్కాటక రాశి సెప్టెంబరు నెల జాతకఫలం
మిథున రాశి, కర్కాటక రాశి సెప్టెంబరు నెల జాతకఫలం

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారనుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారిని అదృష్టం వరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి భారీ లాభాలు కలుగుతాయి. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారాలు చేసేవారికి విశేష ప్రయోజనాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నవారి కల నెరవేరుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఘన విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+