సచివాలయ ఉద్యోగుల నిరసన, ఉద్రిక్తత- మంత్రి కీలక ప్రకటన..!!

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడకు వేలాదిగా తరలి వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్యోగులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొంతమంది మహిళా ఉద్యోగులను బలవంతంగా వాహనాలు ఎక్కించినా వారిలో పలువురు బస్సు కిటికీల్లో నుంచి కిందికి దూకేశారు. ఇదే సమయంలో మంత్రి స్వామి ఉద్యోగుల సమస్యల పై కీలక ప్రకటన చేసారు.

తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై ప్రభుత్వం స్పందిస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విజయవాడలోని గాంధీ నగర్ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. ఏడేళ్లుగా సచివాలయ సిబ్బందిగా పనిచేస్తున్నా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు, సౌకర్యాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించినా.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి రావటంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ వైఖరికి, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు.

పవన్ ఏంటో అర్దమయ్యేలా త్వరలో చెబుతా తమ్ముడు పేర్ని కిట్టి.. బండ్ల గణేష్ కౌంటర్..!!
పవన్ ఏంటో అర్దమయ్యేలా త్వరలో చెబుతా తమ్ముడు పేర్ని కిట్టి.. బండ్ల గణేష్ కౌంటర్..!!
swarna-village-ward-secretariat-employees-protest-turns-tense-in-vijayawada-here-the-report

మంత్రి స్వామి ప్రకటన

ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఇవ్వాల్సిన పదోన్నతులతో పాటు ఇతర అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంత చెప్పినా వారు వినకపోవడంతో యూనియన్ నాయకులు, సచివాలయ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పందించారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో సంకీర్ణ ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. సిబ్బంది రెగ్యులరైజేషన్, వారికి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు గతంలో జరగాల్సిన రెగ్యులరైజేషన్‌ను ప్రస్తుత ప్రభుత్వమే అమలు చేసిందని గుర్తుచేశారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిషన్ వేయబోతున్నామని ప్రకటించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+