ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల రోడ్లకు రూ.1,130 కోట్లు.. తీపి కబురు!

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం హ్యామ్ రోడ్లకు శ్రీకారం చుడుతుంది.తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో (HAM) పద్ధతిలో అభివృద్ధి చేస్తోంది. ఇది దేశంలోనే గ్రామీణ రోడ్లకు HAM విధానం వాడిన తొలి రాష్ట్రంగా తెలంగాణా నిలుస్తోంది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల వాసులకు శుభవార్త. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలకు సంబంధించిన పనులపై, ముఖ్యంగా హ్యామ్ రోడ్ వర్క్స్ పైన మంత్రి సీతక్క తాజాగా నిర్వహించిన సమీక్షలో కీలక విషయాలను వెల్లడించారు. సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో హ్యామ్ (HAM) విధానంలో 445 రహదారులను 1,366 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

HAM road works Minister Seethakka Orders on 1130 cr worth warangal khammam works to Start by October 25

ఈ పనులకు రూ.1,130 కోట్లు కేటాయించారు. అన్ని ప్యాకేజీలకు సంబంధించిన పనులను అక్టోబర్ 25వ తేదీలోగా ప్రారంభించాలని కాంట్రాక్టర్లను స్పష్టంగా ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. మిషన్ భగీరథ పరిధిలోని 86 సమస్యాత్మక ఆవాసాల్లో తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క గుర్తు చేశారు. రహదారులు, తాగునీటి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని మంత్రి పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేసి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. పనులు ఆలస్యం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని పార్టీలకు బిగ్ టాస్క్.. పట్టభద్రులపై పట్టు ఎవరికో!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అన్ని పార్టీలకు బిగ్ టాస్క్.. పట్టభద్రులపై పట్టు ఎవరికో!

తెలంగాణలో హ్యామ్ విధానంలో మూడు దశల్లో మొత్తం 18,472 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 7,448 కిలోమీటర్ల మేర సుమారు 2,145 రోడ్లను రూ.6,294 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ పనుల వల్ల సుమారు 3,000కు పైగా గ్రామ పంచాయతీలు లబ్ధి పొందనున్నాయి. ఈ రోడ్ల పనులు అక్టోబర్ 25, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+