తెలంగాణ బీజేపీకి చికిత్స - నేరుగా రంగంలోకి, గేమ్ షురూ..!!
తెలంగాణ కేంద్రంగా బీజేపీ ఆపరేషన్ ప్రారంభించింది. పార్టీలో నెలకున్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన నాయకత్వం ముందుగా చికిత్స ప్రారంభించింది. ఇందు కోసం కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కీలక సమావేశాలకు సిద్దమైంది. కాంగ్రెస్- బీఆర్ఎస్ కు ధీటుగా కొత్తగా వ్యూహాలను సిద్దం చేస్తోంది. దీంతో, వచ్చే మూడు రోజులు పార్టీలో చోటు చేసుకునే పరిణామాలు కీలకంగా మారనున్నాయి.
తెలంగాణ లో బీజేపీ ఆపరేషన్ ప్రారంభించింది. ముందుగా పార్టీని చక్కదిద్దాలని డిసైడ్ అయింది. కేంద్ర కేబినెట్ లోనూ భవిష్యత్ వ్యూహాలకు తగినట్లుగానే తెలంగాణ నుంచి మార్పు లు - చేర్పులు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీహార్ - పశ్చిమ బెంగాల్ మోడల్ ను అమలు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రధాని మోదీ ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లగా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రేపు (ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం పెంచటం, త్వరలో జరిగే నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మూడు రోజులపాటు రాష్ట్ర నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా భావిస్తోంది. ఎప్పుడు వచ్చినా సత్తా చాటేలా రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

పార్టీ నేతలకు దిశా నిర్దేశం
కాగా, రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దాలని నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటి కే పలు మార్గాల ద్వారా పార్టీలో పరిస్థితుల పైన నివేదికలు తెప్పించుకుంది. ఢిల్లీకి పిలిపించి రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశం చేసినా మార్పు రాకపోవటంతో.. ఇక చర్యలు తప్పవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా.. క్రియాశీలంగా పనిచేయటం లేదని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కష్టపడుతున్నా, ఆయన బృందంలోని ఎక్కువ మంది సొంత పనులకే పరిమితమవుతున్నారన్న విషయం ఢిల్లీకి చేరింది. ఒకటిరెండు మోర్చాలు తప్ప.. జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉంది. ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలకు కూడా కొందరు నేతలు హాజరు కాలేదు. అలాంటి నేతలందరికీ నితిన్ నబిన్ హెచ్చరికలుచేయటంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ పైన రూట్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు.













Click it and Unblock the Notifications