30 ఏళ్ల కల నిజమవుతోంది! 4 జిల్లాల తలరాత మారబోతోంది

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నందుకు రైతులు కళ్లనీళ్లు పెట్టుకుని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు.

నాలుగు జిల్లాల తలరాతను మార్చే వెలిగొండ

ప్రాజెక్టు కోసం భూములను వదులుకోవడం అంటే అది సామాన్యమైన త్యాగం కాదని, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను త్యాగం చేశారని సీఎం అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్యలతో అల్లాడుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు, 1985లోనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. 1996లో తాము శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును, అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలు ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం వివరించారు.

Veligonda Project Milestone CM Chandrababu Meets Evacuees Distributes 300 Cr Relief to Affected Farmers
 ఏపీ, తెలంగాణా జలజగడం పరిష్కారం కాదా .. తాజాగా వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్ట్ లపై కొత్త పంచాయితీ
ఏపీ, తెలంగాణా జలజగడం పరిష్కారం కాదా .. తాజాగా వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్ట్ లపై కొత్త పంచాయితీ

ఆర్ అండ్ ఆర్ నిధుల విడుదల

వెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 10,580 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో ఇప్పటికే రూ. 6,736 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. మిగిలిన రూ. 3,844 కోట్లను త్వరితగతిన ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2024లో తమ ప్రభుత్వం వచ్చాక రూ. 759 కోట్లు ఖర్చు చేశామని, ముఖ్యంగా నిర్వాసితుల కోసం రూ. 905 కోట్లు మంజూరు చేసి, అందులో రూ. 300 కోట్లను ఈరోజే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లోనే ఈ నిధులు నిర్వాసితుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. ఈ నిధులు కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాం నగర్, మెట్టి గొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాలకు చెందిన 2,351 మంది నిర్వాసితులకు అందుతాయని తెలిపారు.

గుంటూరు మిర్చికి చైనా షాక్.. సీఎం బయటపెట్టిన సంచలన నిజం
గుంటూరు మిర్చికి చైనా షాక్.. సీఎం బయటపెట్టిన సంచలన నిజం

జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లు

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. ఫేజ్-2 పూర్తయితే 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. నిర్వాసితులకు కలెక్టరేట్ పక్కనే పునరావాసం కల్పిస్తూ, అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలను పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. తమ త్యాగాల వల్ల 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, ప్రాజెక్టు పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రైతులు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+