జగన్ నుంచి కాపాడింది నేనే, చింతమనేని ఓ రౌడీ, డీజీపీ గారూ! మేమే చర్యలు తీసుకోవాలా?: పవన్ నిప్పులు

దెందులూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం దెందులూరు బహిరంగ సభలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన నిప్పులు చెరిగారు. ఆయన ఆకురౌడీ, వీధి రౌడీ అంటూ దుమ్మెత్తిపోశారు. పోలీసులు చర్యలు తీసుకుంటారా, మేం తీసుకోవాలా అని ప్రశ్నించారు. రౌడీల విషయంలో సుప్రీం కోర్టే చేతులు ఎత్తేసిందని, పార్లమెంటో చర్యలు తీసుకోవాలని చెప్పిందని, అంటే మళ్లీ ప్రజాప్రతినిధుల కోర్టులోకే వచ్చిందన్నారు. వాళ్లు వాళ్లే చర్యలు ఎక్కడ ఉంటాయన్నారు.

మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తున్నారని, కానీ ఓ వ్యక్తి అందర్నీ ఇంతలా వేధిస్తుంటే, వనజాక్షి వంటి అధికారిణిపై దాడులు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము అవసరమైతే కత్తి పట్టుకుంటామన్నారు. కత్తి గూండా పట్టుకుంటాడు, దేశాన్ని రక్షించే సైనికుడు పట్టుకుంటాడని, ఆకు రౌడీయే కత్తి పట్టుకుంటే, దేశభక్తి ఉన్న మేం కత్తి పట్టుకోలేమా అన్నారు.

2014లో ఏదో ఆశించి మద్దతివ్వలేదు

2014లో ఏదో ఆశించి మద్దతివ్వలేదు

ప్రభుత్వానికి ఎందుకు ఎదురు తిరగాల్సిందో తాను స్పష్టంగా చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడగలికే వ్యక్తిని తాను అన్నారు. నేను ఏ కులంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో నా చేతిలో ఉండదని, కానీ తాను ఎలా ఉండాలనే విషయం నా చేతుల్లో ఉంటుందని చెప్పారు. 2014లో తాను ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని చెప్పారు.

19 ఏళ్ల వయస్సులో సాయుధ పోరాటానికి సిద్ధపడ్డా

19 ఏళ్ల వయస్సులో సాయుధ పోరాటానికి సిద్ధపడ్డా

నేను 19 ఏళ్ల వయస్సులోనే సాయుధ పోరాటానికి సిద్ధమయ్యానని పవన్ చెప్పారు. అణగారిన వర్గాల వారి తరఫున పోరాడటం కోసమే తాను పార్టీ పెట్టానని చెప్పారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గం యువతలోను తన అభిమానులు ఉన్నానని చెప్పారు. రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. తాను ఒక్క కులాన్ని నమ్మి పార్టీ పెట్టలేదని చెప్పారు. మనకు కావాల్సింది సింగపూర్ తరహా రాజధాని కాదని, సింగపూర్ తరహా పాలన అన్నారు.

రౌడీలు సభకు వచ్చి పిచ్చిపిచ్చి వాగుడు

రౌడీలు సభకు వచ్చి పిచ్చిపిచ్చి వాగుడు

రౌడీలు చట్ట సభలకు వచ్చి పిచ్చిపిచ్చి వాగుడు వాగుతున్నారని పవన్ మండిపడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఎన్నో కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆకు రౌడీకి చీఫ్ విప్ ఇస్తే మీకు అండగా ఎలా నిలబడతానని ప్రశ్నించారు. బయట క్రమశిక్షణగా లేని చింతమనేని సభలో చీఫ్ విప్‌గా ఎలా క్రమశిక్షణలో పెడతారని నిలదీశారు.

ఇన్ని కేసులు ఉంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారు

ఇన్ని కేసులు ఉంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారు

తహసీల్దారు వనజాక్షిపై దాడి చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పవన్ ప్రశ్నించారు. చింతమనేనిపై ఇన్ని కేసులు ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటారని ప్రశ్నించారు. కులాలను దూషించి, దాడులు చేసే చింతమనేనిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని తెలిపారు. సీఎంకు తాను మద్దతిచ్చినప్పుడు బలమైన లా అండ్ ఆర్డర్ కోరానని, ఆడపడుచులకు భద్రత కోరానని చెప్పారు. కానీ క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

జగన్ నుంచి రక్షించింది జనసేనే

జగన్ నుంచి రక్షించింది జనసేనే

న్యాయవ్యవస్థ సక్రమంగా పని చేస్తే రౌడీ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటారని పవన్ అన్నారు. రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని వంటి వ్యక్తులు విదేశాల్లో ఉంటే చట్ట సభలలో ఉండనీయరన్నారు. నాడు జగన్ నుంచి టీడీపీని రక్షించింది జనసేననే అన్నారు. గూండాయిజం చేస్తూ రాజకీయం చేస్తామంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

చింతమనేనిపై మీరు చర్యలు తీసుకుంటారా, మేం తీసుకోవాలా

చింతమనేనిపై మీరు చర్యలు తీసుకుంటారా, మేం తీసుకోవాలా

చింతమనేని ఆకు రౌడీ, గాలి రౌడీ, వీధి రౌడీ అంటూ పవన్ నిప్పులు చెరిగారు. తాను డీజీపీని అడుగుతున్నానని, అలాంటి వ్యక్తిపై మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించారు. ఆడపిల్లల్ని, మహిళల్ని ఏమైనా అంటే కాళ్లు చేతులు విరగ్గొడతాం అన్నారు. డీజీపీ, హోంసెక్రటరీ, వెస్ట్ గోదావరి కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నానని, మీరు ఆయనపై చర్యలు తీసుకుంటారా, మేం తీసుకోవాలా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+