వెల్‌కం టు పవన్ కల్యాణ్: టిడిపియా, పిఆర్పీయా!?

Pawan Kalyana
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీయే కాదు! టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ కూడా అయ్యారు. పవన్ టిడిపిలో చేరుతారనే ప్రచారంపై సామాజిక వెబ్‌సైట్లతో పాటు వార్తా ఛానళ్లలో కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు భిన్నరకాలుగా స్పందించారు.

టిడిపి ఆహ్వానం

పవన్ కల్యాణ్ వస్తానంటే తాము స్వాగతిస్తామని టిడిపి నేతలు పలువురు వేర్వేరుగా స్పందించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... పవన్ పార్టీలో చేరితే స్వాగతిస్తామన్నారు. అయితే అలాంటి చర్యలు జరుగుతున్నట్లు తనకు ఏమీ తెలియదని చెప్పారు. పవర్ స్టార్ టిడిపిలో చేరితే స్వాగతిస్తామని అయితే, అది అధిష్టానం నిర్ణయమని దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు.

కోడెల శివ ప్రసాద్ కూడా ఆహ్వానిస్తామన్నారు. మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరే విషయం పవన్‌నే అడగాలని చెప్పారు. అయితే పవన్‌కు మాత్రం కితాబిచ్చారు. ఆయన మంచి హీరో అని, పదిమందికి సాయం చేస్తారని పేరు ఉందన్నారు.

బాలకృష్ణ మధ్యవర్తిత్వమంటూ..

పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బాలకృష్ణ - పవన్ కల్యాణ్‌ల ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ పైన వ్యతిరేకత ఉన్న పవన్‌ను టిడిపిలోకి తెచ్చే బాధ్యత బాలయ్య పైన పెట్టారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే చర్చల విషయం పార్టీ సీనియర్లు కొట్టి పారేయడం గమనార్హం.

అవసరమైతే పిఆర్పీ పునరుద్ధరణ..

పవన్ కల్యాణ్ టిడిపిలో చేరుతారనే ప్రచారాన్ని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. పవన్ సినిమాల్లో మెగాస్టార్‌గా ఉన్నారని, ఆయనకు రాజకీయాలు సరిపడవని మంత్రి గంటా శ్రీనివాస రావు చెబుతున్నారు.

పవన్‌కు రాజకీయాల్లోకి రావాలనుకుంటే టిడిపిలో చేరే అవకాశం ఎంతమాత్రం లేదని అవసరమైతే తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరిస్తారని కొందరు అంటున్నారు. పవన్‌కు కాంగ్రెసు పార్టీ పైన ఎంతగా వ్యతిరేకత ఉన్నా చిరంజీవి ఆ పార్టీలో కేంద్రమంత్రిగా ఉన్నారని, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా టిడిపిలో చేరే అవకాశమే లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+